పవన్ కల్యాణ్(Pawankalyan Birthday).. ఆ పేరు తెరపై కనిపిస్తే చాలు థియేటర్ దద్దరిల్లుతుంది. ఆయన గొంతు వినిపిస్తే చాలు 'పవర్ స్టార్.. పవర్ స్టార్' అంటూ మార్మోగిపోతుంది. ఇది పవన్‌కు ఉన్న క్రేజ్. కెరీర్ ప్రారంభం నుంచి తన మ్యానరిజంతో ప్రత్యేకంగా నిలవడమే ఇందుకు కారణం. పవన్ పోషించిన పాత్రల పేర్లలో ఓ కిక్ ఉంటుంది. వాటిని ఆయన పలకడంలో ఓ మ్యాజిక్ ఉంటుంది. నేడు పవర్‌స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల్లోని హై ఓల్టేజ్ పేర్లను చూద్దాం.
బద్రి.. బద్రినాథ్
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పూరి తెరకెక్కించిన 'బద్రి' చిత్రంలో బద్రినాథ్ అలియాస్ బద్రిగా సందడి చేశారు పవన్. 'నువ్వు నందా అయితే నేను బద్రి.. బద్రినాథ్' డైలాగ్ ట్రెండ్ సెట్ చేసింది. ఈ చిత్రంలో పవన్ హుషారైన నటన యువతను ఊపేసింది.
బాలు.. గని
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కరుణాకరన్ తెరకెక్కించిన 'బాలు' చిత్రంలో బాలు, గని అనే పాత్రల్లో కనిపించారు పవన్. ఈ చిత్రం నుంచి వరుసగా విభిన్న పేర్లు ఉన్న పాత్రల్లో నటించారు. గని.. రెండు అక్షరాలే అయినా ఈ క్యారెక్టర్ మంచి పేరు తీసుకొచ్చింది.
సంజు.. సంజయ్ సాహు
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'జల్సా'లో మరోసారి చిన్న పేరు అలియాస్ పెద్ద పేరు పెట్టుకుని అభిమానులతో జల్సా చేయించాడు. విలన్‌తో 'నే చెప్పానని చెప్పు. నా పేరు తెలుసా? సంజయ్ సాహు చెప్పాడని చెప్పు' అంటూ యాక్షన్ ప్రదర్శించిన తీరు చిరస్థాయిగా నిలుస్తుంది.
అర్జున్ పాల్వాయ్.. మైఖేల్ వేలాయుధం
జయంత్ సి. పరాన్జీ తెరకెక్కించిన 'తీన్‌మార్'లో అర్జున్ పాల్వాయ్, మైఖేల్ వేలాయుధం అనే సరికొత్త పేర్లను తెరపై ఆవిష్కరించి ఆకట్టుకున్నారు.
సిద్ధార్థ రాయ్
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎస్.జె. సూర్య దర్శకత్వంలో పవన్ నటించిన చిత్రం 'ఖుషి'. ఇందులో సిద్ధు అలియాస్ సిద్ధార్థ రాయ్‌గా వినోదం పంచారు పవన్. 'నేనెవరో తెలుసా? గుడుంబా సత్తి' అని విలన్ తుపాకీని తల మీద పెట్టిన సన్నివేశంలో ''మీరు గుడుంబా సత్తి కావొచ్చు, తొక్కలో సత్తిగారు కావొచ్చు బట్ ఐ డోన్ట్ కేర్. బికాజ్ ఐయామ్ సిద్ధు.. సిద్ధార్థ రాయ్'' అంటూ పేల్చిన పంచ్ బీభత్సం సృష్టించింది.
వెంకటరత్నం నాయుడు
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్‌స్టార్ నటించిన చిత్రం 'గబ్బర్ సింగ్'. ఇందులో వెంకటరత్నం నాయుడు పేరు మార్చుకుని గబ్బరసింగ్‌గా రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే.
అభిషిక్త భార్గవ్.. బాలసుబ్రహ్మణ్యం
'అజ్ఞాతవాసి'తో త్రివిక్రమ్ మరోసారి పవన్‌ను కొత్త పాత్రల్లో చూపించారు. అభిషిక్త భార్గవ్ అనే నయా పేరుతో సందడి చేయిస్తూనే బాల సుబ్రహ్మణ్యంగానూ ఎంటర్‌టైన్ చేయించారు.
వకీల్‌సాబ్..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'వకీల్ సాబ్' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు పవన్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లాయర్ సత్యమూర్తి పాత్ర పోషించారు. అయితే ఈ పేరు అంతగా ప్రచారంలోకి రాకపోయినా 'వకీల్‌సాబ్' పేరు మార్మోగిపోయింది.
'భీమ్లానాయక్'గా
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పవన్ నటిస్తున్న సినిమాల్లో 'అయ్యప్పనుమ్ కోషియుమ్' (భీమ్లానాయక్) రీమేక్ ఒకటి. ఇందులో భీమ్లా నాయక్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలరించనున్నారు పవన్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.
దీంతోపాటు క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు', హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో రెండు చిత్రాలు చేస్తున్నారు పవన్. సెప్టెంబరు 2(గురువారం) ఆయన(Pawankalyan Birthday) పుట్టినరోజు సందర్భంగా 11.16గంటలకు 'భీమ్లానాయక్'లోని ఫస్ట్‌సాంగ్ విడుదల కానుంది. 1.20గంటలకు హరిహర వీరమల్లు, 2.20 సురేందర్ రెడ్డి దర్శకత్వంలోని సినిమా, 4.05 గంటలకు హరీశ్ శంకర్ దర్శకత్వంలోని సినిమా అప్డేట్స్తో పవన్ హంగామా చేయనున్నారు.
ఇదీ చూడండి: pawankalyan birthday: పవన్ మెచ్చిన పుస్తకాలు ఇవే!