ETV Bharat / sitara

పూనమ్ పాండేకు తీవ్ర గాయాలు.. జైల్లో భర్త! - poonam pandey compaints against husband

బాలీవుడ్​ నటి పూనమ్​ పాండే.. తన భర్తపై మరోసారి కేసు పెట్టింది. పోలీసులు అతడిని అరెస్ట్​ చేశారు. ఆమె ముఖంపై తీవ్రంగా గాయాలు ఉన్నాయని, తనను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

poonam pandey
పూనమ్​ పాండే
author img

By

Published : Nov 9, 2021, 9:59 AM IST

వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచే బాలీవుడ్​ బోల్డ్​ బ్యూటీ పూనమ్​ పాండే మళ్లీ హాట్​ టాపిక్​గా మారింది. మరోసారి తన భర్త సామ్​ బాంబేపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై దాడి చేశాడని కంప్లెయింట్​లో పేర్కొన్నట్లు తెలుస్తోంది! కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్​ చేశారు.

"సామ్​ బాంబేపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నాం. పూనమ్​ ముఖంపై తీవ్రంగా గాయాలు ఉన్నాయి. ఆమె ఫిర్యాదు చేసిన అనంతరం ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నాం" అని ఓ అధికారి వెల్లడించారు.

గతేడాది సెప్టెంబరు 10న తన ప్రియుడు సామ్​ బాంబేను వివాహమాడిన పూనమ్​.. పెళ్లి జరిగిన కొద్ది రోజుల్లోనే అతడిపై కేసు పెట్టింది. తనను లైంగికంగా వేధిస్తూ, బెదిరింపులకు గురిచేస్తున్నాడని వెల్లడించింది. అప్పుడు కూడా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తామిద్దరం కలిసి పోయినట్లు ట్వీట్​ చేసింది. అనంతరం మళ్లీ ఇప్పుడు అతడిని అరెస్ట్​ చేయించింది!

ఇదీ చూడండి: భర్తను అరెస్ట్​ చేయించిన నటి పూనమ్​ పాండే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.