ETV Bharat / sitara

మహేశ్​-త్రివిక్రమ్​ సినిమాలో పూజాహెగ్డే! - మహేష్​బాబు త్రివిక్రమ్

మహేశ్​-త్రివిక్రమ్​ కాంబినేషన్​లో తెరకెక్కనున్న చిత్రంలో హీరోయిన్​గా పూజా హెగ్డేను ఎంపిక చేశారని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే కథ విన్న ఆమె స్టోరీకి ఫిదా అయినట్లు టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. ఏడాది చివర్లో సినిమా సెట్స్​పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Pooja Hegde to star opposite Mahesh in his next movie?
మహేశ్​-త్రివిక్రమ్​ సినిమాలో పూజాహెగ్డే!
author img

By

Published : Apr 10, 2021, 6:40 AM IST

సూపర్​స్టార్​ మహేశ్​ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో పాటు ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాయికగా పూజాహెగ్డేని ఎంపిక చేశారని సమాచారం. ఇప్పటికే పూజాతో చిత్రబృందం చర్చలు కూడా జరిపిందట. స్క్రిప్టు విన్న ఆమె సానూకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే మహేశ్​తో కలిసి పనిచేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

'ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28' వర్కింగ్ టైటిల్‌గా రూపొందనున్న ఈ సినిమాను హారిక అండ్‌ హాసిని సంస్థతో కలిసి జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించనుంది. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలోనే రానుంది. గతంలో త్రివిక్రమ్‌-మహేశ్​ బాబు కాంబినేషన్లో 'అతడు', 'ఖలేజా' వంటి చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాగా 'ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28' తెరకెక్కనుంది.

పూజాహెగ్డే-మహేశ్​బాబుతో కలిసి 'మహర్షి' చిత్రంలో నటించి అభిమానుల్ని అలరించింది. ప్రస్తుతం మహేశ్​‌- పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'సర్కారు వారి పాట'తో బిజీగా ఉన్నారు. పూజాహెగ్డే - ప్రభాస్‌తో కలిసి 'రాధేశ్యామ్‌', చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న 'ఆచార్య'లోనూ నటిస్తున్నారు.

ఇదీ చూడండి: 'బాహుబలి', 'రాధేశ్యామ్' రికార్డు బ్రేక్ చేసిన 'పుష్ప'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.