'నీ కాళ్లను పట్టుకొని వదలనన్నవి చూడే మా కళ్లు' అంటూ అభిమానులు ఆరాధించే అందం ఆమెది. 'జిల్ జిల్ జిగేలు రాణి..' అంటూ కుర్రకారు హుషారుగా పాడుకునేలా చేసిన సోయగం ఆమెది. ఆ పొడుగుకాళ్ల సుందరే పూజా హెగ్డే(pooja hegde movies). 'దువ్వాడ జగన్నాథమ్', 'అరవింద సమేత...', 'మహర్షి', 'అల..వైకుంఠపురములో'(ala vaikunthapurramuloo song), ఇలా బ్లాక్‌బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న ఆమె నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'(most eligible bachelor review) ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే 'ఈనాడు సినిమా'తో ప్రత్యేకంగా ముచ్చటించింది పూజ.
"ఈసారి దసరా పండగ చాలా బాగా జరుపుకొన్నాను. పండగ ఆనందాన్ని రెట్టింపు చేసేలా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'(most eligible bachelor songs) విజయం సాధించింది. ఈ నెల్లోనే నా పుట్టిన రోజు సంతోషంగా జరిగింది. ఓ విధంగా ఈ సినిమా విజయం నాకు పుట్టినరోజు కానుక"
ఇప్పుడే మొదలైంది
"నా కెరీర్ మొదలై పదేళ్లు కావొస్తుంది అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే కెరీర్ పరంగా అనుకోకుండా చాలా గ్యాప్‌లు వచ్చాయి. భారీ విజయాలు అందుకున్నా సరే ఇప్పుడే నా కెరీర్ మొదలైంది అనిపిస్తుంది. భవిష్యత్తులో నా నుంచి రాబోయే పాత్రలు ప్రేక్షకులు మర్చిపోలేరు."
ఒదిగిపోతుంది అంటున్నారు
'ముకుంద' తర్వాత పూజ గ్లామర్ పాత్రలు చేయలేదు అన్నవారే 'దువ్వాడ జగన్నాథమ్' తర్వాత గ్లామర్ పాత్రలకు సరిగ్గా కుదిరే అందం అన్నారు. ఆ తర్వాత నేను చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు పూజ ఏ పాత్రలోనైనా ఒదిగిపోతుంది అంటున్నారు. అది ఆనందించే విషయమే కానీ ఇంకా చాలా సాధించాలి.
మహారాణి గాయత్రి దేవిగా..
నాకు నాయికా ప్రాధాన్య చిత్రాలు చేయాలంటే ఇష్టమే. కొన్ని కథలు విన్నాను. అవి ఇంకా చర్చల దశలో ఉన్నాయి. బయోపిక్‌ల్లో నటించాలని ఉంది. వీటికి చాలా పరిశోధన, శ్రమ అవసరం. నా వరకూ అయితే జైపూర్ మహారాణి గాయత్రి దేవి జీవిత కథలో నటించాలని ఆశగా ఉంది.
నేను ప్రేమ కథా చిత్రాలు చేసింది తక్కువ.. వ్యక్తిగతంగా నాకు ఎలాంటి ప్రేమ కథలు లేవు. ఇప్పటివరకూ నాకైతే ఒక్క ప్రేమ లేఖా రాలేదు. కాలేజీ రోజుల్లో నేను చాలా సిగ్గరి. ఇప్పుడేమో సినిమాలతో తీరిక లేదు. భవిష్యత్తులో ఏమవుతుందో తెలియదు.
ఇవీ చదవండి: