ETV Bharat / sitara

'బ్యాచ్​లర్'​ షూటింగ్​లో పాల్గొన్న బుట్టబొమ్మ - shooting

అక్కినేని వారసుడు అఖిల్​ హీరోగా వస్తున్న చిత్రం 'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్​. లాక్​డౌన్​ అనంతరం మంగళవారం సినిమా షూటింగ్​ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే హీరోయిన్ పూజా హెగ్డే చిత్రీకరణలో పాల్గొంది.

hegdepooja
పూజా హెగ్డే
author img

By

Published : Sep 15, 2020, 9:01 PM IST

కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​తో నిలిచిపోయిన సినిమా షూటింగులు ఒక్కొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు చిత్రీకరణ కూడా పూర్తి చేసుకున్నాయి. ఈ క్రమంలోనే సుదీర్ఘ విరామం అనంతరం అక్కినేని అఖిల్​ హీరోగా తెరకెక్కుతోన్న 'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్'​ షూటింగ్​ పునఃప్రారంభమైంది. బొమ్మరిల్లు భాస్కర్​ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.

ఈ సందర్భంగా మంగళవారం బుట్టబొమ్మ పూజా హెగ్డే షూటింగ్​లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్​స్టాగ్రామ్​లో అభిమానులతో పంచుకుంది.

గీతా ఆర్ట్స్​ పతాకంపై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ స్వరకర్త. ఈ సినిమాతో పాటు పూజ.. ప్రభాస్​ హీరోగా తెరకెక్కుతున్న 'రాధేశ్యామ్​'లోనూ నటిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.