ETV Bharat / sitara

రాసిపెట్టి ఉంటే తప్పుకుండా జరుగుతుంది: పూజా హెగ్డే - మూవీ న్యూస్

తమిళంలో విజయ్​ సరసన నటించనుందంటూ వస్తున్న వార్తలపై హీరోయిన్​ పూజాహెగ్డే స్పందించింది. ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నానని తెలిపింది.

pooja hegde in thalapathy vijay new movie?
రాసిపెట్టి ఉంటే తప్పుకుండా జరుగుతుంది: పూజా హెగ్డే
author img

By

Published : Feb 27, 2021, 5:13 PM IST

తమిళ సినిమా 'ముగముది'తో అరంగేట్రం చేసిన పూజాహెగ్డే.. ఆ తర్వాత కోలీవుడ్​లో సినిమా చేయలేకపోయింది. దక్షిణాదిలో స్టార్​ హీరోయిన్​గా రాణిస్తున్న ఆమె.. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తమిళంలోకి రీఎంట్రీ ఇచ్చేలా కనిపిస్తోంది. స్టార్​ హీరో విజయ్ సరసన ఆమె నటిస్తోందని ప్రచారం సాగుతోంది. సదరు వార్తలపై ఆమె ఇటీవల స్పందించింది.

విజయ్‌తో సినిమా కోసం తాను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని పూజా చెప్పింది. ఒకవేళ #విజయ్‌65లో భాగమైతే.. అదంతా తన అదృష్టమనే అనుకుంటానని తెలిపింది. ఆయనతో స్క్రీన్‌ పంచుకోవాలని రాసిపెట్టి ఉంటే తప్పకుండా జరుగుతుందని సంతోషం వ్యక్తం చేసింది.

pooja hegde in thalapathy vijay new movie?
పూజా హెగ్డే

పూజా హెగ్డే తెలుగులో ప్రస్తుతం 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌', 'రాధేశ్యామ్‌' సినిమాల్లో నటించింది. వీటితోపాటు రామ్‌చరణ్‌కు జోడీగా 'ఆచార్య' సినిమాలో పూజా ఓ కీలకపాత్ర, బాలీవుడ్‌లో 'సర్కస్‌' సినిమాలో ఈమె కథానాయికగా నటిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.