ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది నటి పూజా హెగ్డే. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కాసేపు అభిమానులతో చాట్ చేసిందీ ముద్దుగుమ్మ. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అయితే ఓ నెటిజన్ మాత్రం అభ్యంతరకర సందేశం పెట్టాడు. పూజను న్యూడ్ ఫొటో పెట్టమని కోరాడు. దీనికి చాకచక్యంగా సమాధానమిచ్చింది పూజ.
ఆ నెటిజన్‌కు తన న్యూడ్ ఫొటో బదులు రెండు కాళ్లను పొటో తీసి పెట్టింది. దీంతో షాక్ తినడం అతడి వంతైంది. దీని పట్ల అభిమానులు పూజను ప్రశంసలతో ముంచెతుతున్నారు. కోపగించుకోకుండా తెలివిగా ఇచ్చిన సమాధానానికి మెచ్చుకుంటూ పోస్టులు పెడుతున్నారు.
ప్రస్తుతం పూజా హెగ్డే ప్రభాస్ సరసన 'రాధేశ్యామ్', అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్', హిందీలో 'సర్కస్' చిత్రాల్లో నటిస్తోంది.