దక్షిణాది సినీ ఇండస్ట్రీపై పూజా హెగ్దే చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. దీనిపై మరోసారి స్పందించింది నటి పూజ. తాను వేరే సందర్భాన్ని ఉద్దేశిస్తూ ఆ వ్యాఖ్యలు చేశానని పేర్కొంది.
"మొదట నేను ఇంటర్యూలో చేసిన వ్యాఖ్యలు వేరే సందర్భాన్ని ఉద్దేశిస్తూ చేసినవి. నాకు తెలుగు సినీ పరిశ్రమ అంటే ప్రాణం. ఈ పరిశ్రమకు నేను రుణపడి ఉంటాను. నా వ్యాఖ్యలు ఎలాంటి అపార్ధాలకు దారితీయకూడదని ఈ విషయంపై క్లారిటీ ఇస్తున్నా".
-పూజా హెగ్దే, సినీ నటి.
ఇటీవలే ప్రభాస్‌తో కలిసి 'రాధే శ్యామ్' సినిమా షూటింగ్ ఇటలీలో పూర్తి చేసుకుని వచ్చిన పూజా హెగ్దే.. ఓ ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చింది. ఇందులో దక్షిణాది సినిమాలను అవమానపరిచేలా కొన్ని వ్యాఖ్యలు చేసింది.
ఇదీ చదవండి:'బైడెన్ గజినీ.. కమల విజయం చరిత్రాత్మకం'