Police Story Movie: ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయికుమార్ పేరు చెప్పగానే మొదటగా గుర్తొచ్చేది 'పోలీస్ స్టోరీ' సినిమా డైలాగ్. 'చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే మూడు సింహాలు ప్రతీకలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్' అంటూ సాయి కుమార్ చెప్పిన డైలాగ్‌ను తెలుగు సినీ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఈ చిత్రం అటు సాయి కుమార్‌కు గొప్ప పేరు తీసుకొస్తూనే బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం అందుకుంది. అలాంటి ఈ చిత్రం విడుదలై నేటికి 25 సంవత్సరాలు గడిచాయి.
దర్శకుడు థ్రిల్లర్ మంజు తెరకెక్కించిన ఈ చిత్రం తొలుత కన్నడలో విడుదలైంది. ఈ ఏడాది మార్చిలో 'పోలీస్ స్టోరీ' కన్నడ చిత్రం విడుదలై 25 ఏళ్లు ముగిసింది. ఈ సందర్భంగా మాట్లాడిన సాయికుమార్.. 'ఇప్పుడు అందరూ అంటున్న పాన్ ఇండియా సినిమాను ఆనాడే 'పోలీస్ స్టోరీ'తో చేసేశాం. నా కెరీర్‌లో ఆ చిత్రం ఒక మైలురాయి. అంతటి విజయాన్నిచ్చిన కన్నడ చిత్ర పరిశ్రమకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నా సినీ ప్రస్థానం మొదలై 50 ఏళ్లు దగ్గరపడుతోంది' అని అన్నారు.
నాలుగో సింహం..
'పోలీస్ స్టోరీ' తర్వాత 'ప్రస్థానం' రూపంలో అతిపెద్ద బ్రేక్ వచ్చినట్లు సాయికుమార్ ఓ సందర్భంలో చెప్పారు. త్వరలోనే 'పోలీస్ స్టోరీ' సీక్వెల్‌ను 'నాలుగో సింహం' పేరుతో అన్ని భాషల్లో అదే టీమ్‌తో నిర్మించబోతున్నామని అన్నారు.
రజనీకాంత్, సుమన్, రాజశేఖర్ వంటి అగ్రనటులకు తన గొంతును అరువిచ్చి వారి సక్సెస్‌లో భాగమయ్యారు సాయికుమార్. ఎన్నో సినిమాల్లో హీరోగా నటిస్తూ, ప్రస్తుతం అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:
ఘనంగా సాయికుమార్ షష్టిపూర్తి వేడుకలు