బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం సినిమా షూట్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ముంబయి పోలీసులు ఆయన షూటింగ్‌ను అడ్డుకున్నారు. జాన్ అబ్రహాం కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఏక్ విలన్ రిటర్న్స్'. దిశాపటానీ కథానాయిక. మోహిత్ సూరీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూట్ ఇటీవలే ప్రారంభమైంది.
ఈ క్రమంలోనే వర్లీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే, కొవిడ్-19 నిబంధనలు పాటించకుండా షూట్ చేస్తున్నారని తెలుసుకున్న పోలీసులు.. లొకేషన్ వద్దకు చేరుకుని షూట్‌ని నిలిపివేశారు. అంతేకాకుండా, నటీనటుల్ని అక్కడి నుంచి పంపించేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి: స్టార్ హీరో సినిమా షూట్‌పై రాళ్ల దాడి