ETV Bharat / sitara

బాలీవుడ్​ నటి కంగన​పై పోలీసులకు ఫిర్యాదు! - కంగనా రనౌత్​ సోదరి రంగోలీ న్యూస్​

బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​పై ముంబయి అంబోలీ పోలీస్​ స్టేషన్​లో ఓ కేసు నమోదైంది. ఓ వర్గాన్ని ఉగ్రవాదులుగా అభివర్ణించిందంటూ ఆమెపై ఓ న్యాయవాది​ ఫిర్యాదు చేశారు.

Police complaint against Kangana Ranaut over remark
బాలీవుడ్​ నటి కంగనా​పై పోలీసులకు ఫిర్యాదు!
author img

By

Published : Apr 24, 2020, 11:56 AM IST

బాలీవుడ్​ క్వీన్​ కంగనా రనౌత్​పై ముంబయిలోని అంబోలీ పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేసిన వీడియోలో ఓ వర్గాన్ని ఉగ్రవాదులుగా అభివర్ణించిందంటూ సబర్బన్​ అంబోలీ పోలీస్​స్టేషన్​లో న్యాయవాది​ అలీ కషిఫ్​ ఖాన్​ దేశ్​ముఖ్​ బుధవారం ఫిర్యాదు చేశారు.

అసలేం జరిగింది?

కంగనా సోదరి రంగోలి ట్విట్టర్‌ ఖాతాను అధికారులు తొలగించారు. ఓ వర్గాన్ని ఉద్దేశించి రంగోలి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోందని బాలీవుడ్‌ సెలబ్రిటీలు చేసిన ఆరోపణలపై స్పందించిన ట్విట్టర్‌ అధికారులు ఆమె అకౌంట్‌ను సస్పెండ్‌ చేశారు. దీనిపై కంగనా రనౌత్​ స్పందిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో పోస్ట్​ చేసింది. అయితే అందులో ఓ వర్గానికి చెందిన వారిని ఉగ్రవాదులుగా అభివర్ణించిందటూ ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి తాజాగా ఆమెపై కేసు నమోదైంది.

ఇదీ చూడండి.. 'రాజమౌళిలో నాకు నచ్చని విషయం అదే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.