ETV Bharat / sitara

నిహారిక ఇంటి వద్ద అర్ధరాత్రి గొడవ.. పరస్పరం ఫిర్యాదు! - నిహారిక న్యూస్​

ఇటీవలే పెళ్లి చేసుకున్న నాగబాబు కుమార్తె నిహారిక నివసించే అపార్ట్​మెంట్​లో వివాదం జరిగినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో నిహారిక ఫ్లాట్​ వద్ద గొడవ జరిగింది. బంజారాహిల్స్​ పోలీస్​ స్టేషన్​లో ఆమె భర్తపై అపార్ట్​మెంట్ వాసులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. నిహారిక భర్త చైతన్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

case on niharika husband
నిహారిక భర్తపై కేసు
author img

By

Published : Aug 5, 2021, 9:52 AM IST

Updated : Aug 5, 2021, 10:32 AM IST

నాగబాబు కూతురు నిహారిక ఇంటి వద్ద అర్ధరాత్రి పెద్ద గొడవ జరిగింది. నిహారిక భర్త చైతన్య న్యూసెన్స్ చేస్తున్నాడని అపార్ట్ మెంట్ వాసులు బంజారాహిల్స్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపార్ట్ మెంట్ వాసులపై చైతన్య కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరస్పర ఫిర్యాదులపై పోలీసులు విచారిస్తున్నారు.

కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ తమకి ఇబ్బందులు కలిగిస్తున్నారని నటి నిహారిక భర్త చైతన్యపై అపార్ట్‌మెంట్‌ వాసులు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది మార్చి నెలలో హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌ నుంచి షేక్‌పేట్‌కు వెళ్లే దారిలో ఉండే ఓ అపార్ట్‌మెంట్‌లో నిహారిక ఫ్లాట్‌ అద్దెకు తీసుకున్నారు. తమ వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన పనుల కోసం ఈ ఫ్లాట్‌ ఉపయోగించుకునేవారు. అయితే, జీహెచ్‌ఎంసీ నిబంధనలు ఉల్లంఘిస్తూ రెసిడెన్షియల్‌ సొసైటీలో వాణిజ్య పరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. కొవిడ్‌ నిబంధనలు బేఖాతరు చేస్తూ గుంపులు గుంపులుగా ఫ్లాట్‌లోకి వస్తున్నారని.. దానివల్ల తాము ఎంతో ఇబ్బందులు పడుతున్నామని సదరు అపార్ట్‌మెంట్‌ వాసులందరూ బుధవారం అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే, తమ వ్యక్తిగత జీవితానికి అపార్ట్‌మెంట్‌ వాసుల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని చైతన్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇదీ చదవండి:'పొన్నియిన్ సెల్వన్​'లో విక్రమ్, ఐశ్వర్య పాత్రలు ఇవేనా?

Last Updated : Aug 5, 2021, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.