భారత ప్రధాని నరేంద్రమోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'పీఎం నరేంద్రమోదీ'. మోదీ పాత్రలో వివేక్ ఒబెరాయ్ కనిపించనున్నాడు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీ ముందుకు జరిగింది. ఏప్రిల్ 12న విడుదల కావాల్సి ఉన్నా, ఏప్రిల్ 5నే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.
ప్రజల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది సినిమా యూనిట్. ఎన్నికల తరుణంలో విడుదల కానుండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వివేక్ ఒబెరాయ్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. వివిధ రూపురేఖలతో కూడిన ఓ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
మేరీకోమ్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఒమంగ్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.