ETV Bharat / sitara

దేశానికి సాయం చేయడం మన బాధ్యత: ప్రియాంక

author img

By

Published : Apr 29, 2021, 3:29 PM IST

Updated : Apr 30, 2021, 10:49 AM IST

కరోనా కారణంగా భారత్ రక్తమోడుతోందని ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే ప్రతిఒక్కరూ తమకు తోచినంత సాయం చేయాలని కోరుతూ ఫండ్‌రైజర్‌ క్యాంపు గురించి వివరించింది.

Please come forward to help India says Priyank Chopra
ప్రియాంకా చోప్రా

కరోనా కారణంగా భారత్‌ రక్తమోడుతోందని ప్రముఖ బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా ఆవేదన వ్యక్తం చేసింది. వివాహం అనంతరం లండన్‌లో స్థిరపడిన ఆమె తాజాగా భారత్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఓ వీడియో షేర్‌ చేసింది. కొవిడ్‌ రోజురోజుకీ విజృంభిస్తోందని.. దానివల్ల ఆసుపత్రులు కూడా కరోనా బాధితులతో నిండిపోయాయని.. సరైన చికిత్స దొరక్క ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది. అలాగే ప్రతిఒక్కరూ తమకు తోచినంత సాయం చేయాలని కోరుతూ ఫండ్‌రైజర్‌ క్యాంపు గురించి వివరించింది.

"నేను ప్రస్తుతం లండన్‌లో ఉన్నా. కానీ, భారతదేశంలో ఉన్న క్లిష్టపరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు నా కుటుంబం, స్నేహితుల నుంచి వింటూనే ఉన్నా. కొవిడ్‌ బాధితులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ఐసీయూలు కూడా ఖాళీ లేని పరిస్థితులున్నాయి. ఆక్సిజన్‌ కొరత ఎక్కువగా ఉంది. మరణాల సంఖ్య కూడా తీవ్రంగా ఉండటం వల్ల మృతదేహాలను సామూహికంగా దహనం చేస్తున్నారు. భారతదేశం నా పుట్టినిల్లు. ప్రస్తుతం భారత్‌ రక్తమోడుతోంది. ఒక గ్లోబుల్‌ కమ్యూనిటీగా ఇప్పుడు మనమే దేశానికి సాయం చేయాలి. భారత్‌కు ఇప్పుడు మీ అవసరం ఉంది. మీకు ఉన్నదానిలో సాయం చేయండి" అని ప్రియాంక పోస్ట్ చేసింది.

Last Updated : Apr 30, 2021, 10:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.