తెలుగు సినీరంగంలో తెలుగమ్మాయిలకు ఎంతో మంచి భవిష్యత్ ఉంటుందని 'మల్లేశం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన యువతి అనన్య నాగళ్ల చెబుతోంది. మల్లేశం చిత్రం చేసేటప్పుడు తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావనే నమ్మకం ఉండేదని, క్రమంగా తన అభిప్రాయం తప్పని రుజువైందన్నారు. సినీపరిశ్రమ తెలుగు అమ్మాయిల కోసం ఎంతగానో ఎదురుచూస్తుందంటోన్న అనన్య.... సాప్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి కథానాయికగా రాణిస్తుండటం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు.
అనన్య నటించిన ప్లేబ్యాక్ చిత్రం ఇటీవల విడుదలై విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో 1993 కాలం నాటి యువతిగా ఆమె నటించింది. పవన్‌కల్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది.
అనన్య.. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జన్మించింది. సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ లఘు చిత్రాల్లో నటించేది. ఈ క్రమంలోనే ఎంఆర్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'షాదీ' లఘు చిత్రంలో నటించింది. ఇందులో ఆమె నటనకు ఉత్తమనటిగా సైమా అవార్డులకు ఎంపికైంది.
ఇదీ చూడండి: 'ప్లేబ్యాక్' చిత్రాన్ని నేను తీయాల్సింది: సుకుమార్
ఇదీ చూడండి: స్క్రీన్‌ప్లే రాయడానికే ఏడాది పట్టింది: హరిప్రసాద్