ETV Bharat / sitara

వివాదంలో రామ్​ కొత్త సినిమా.. డైరెక్టర్​పై ఫిర్యాదు! - ఉప్పెన హీరోయిన్

రామ్​ హీరోగా, లింగుస్వామి దర్శకత్వంలో మొదలు కావాల్సిన చిత్ర కథపై కాపీ ఆరోపణలు వచ్చాయి. ఈ కథ విషయమై గతంలోనూ చిత్రదర్శకుడు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏం జరిగింది?

Plagiarism Dispute Surrounds Ram-Lingusamy film
రామ్ మూవీ
author img

By

Published : Jul 9, 2021, 3:56 PM IST

సినిమా కథలు ఒకేలా ఉన్నాయంటూ ఓ దర్శకుడిపై మరో దర్శకుడిపై ఫిర్యాదు చేయడం తమిళ ఇండస్ట్రీలో అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటుంది. గతంలో ఇలాంటి అనుభవమే స్టార్ డైరెక్టర్స్ ఏఆర్ మురగదాస్, శంకర్​లకు ఎదురయ్యాయి. లింగుస్వామి కూడా గతంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు. అప్పుడు అది పరిష్కారమైనట్లు కనిపించింది. కానీ ఇప్పుడు మరోసారి ఆ వివాదం తెరపైకి వచ్చింది.

ఇంతకీ ఏం జరిగింది?

కోలీవుడ్ మీడియా కథనాల ప్రకారం, 'పందెం కోడి' దర్శకుడు లింగుస్వామి.. 2013లో సూర్యతో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అదే టైమలో సీమన అనే దర్శకుడు, అతడిపై ఫిర్యాదు చేశాడు. సదరు స్క్రిప్ట్​కు తన 'పగలవన్' కథకు పోలికలున్నాయని అన్నాడు. విజయ్​తో దీనిని సినిమాగా తీయాలనుకుంటున్నట్లు సీమన్ పేర్కొన్నాడు. ఈ వివాదాన్ని తమిళనాడు డైరెక్టర్ల అసోసియేషన్​ పరిష్కరించింది.

ఆ తర్వాత 2014లో సూర్య హీరోగా వేరే కథతో లింగుస్వామి.. అంజాన్(తెలుగులో 'సికిందర్') సినిమా తెరకెక్కించారు. మరోవైపు సీమన్.. 'పగలవన్'ను మొదలేపెట్టలేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మరోసారి లింగుస్వామిపై ఫిర్యాదు చేశారు సీమన్. తెలుగు హీరో రామ్​తో అదే కథను ఉపయోగించి, సినిమా తీస్తున్నారని పేర్కొన్నారు.

Ram-Lingusamy film
రామ్ కొత్త సినిమా టీమ్

దీంతో డైరెక్టర్​ లింగుస్వామి నుంచి అసోసియేషన్ వివరణ కోరింది. 2013లో ఆ వివాదం పరిష్కారమైందని, డైరెక్టర్ల అసోసియేషన్​ నుంచి తనకు క్లీన్​చిట్​ కూడా వచ్చిందని లింగుస్వామి వెల్లడించారు. తమిళంలో తప్పించి ఇతర భాషల్లో ఈ కథను తెరకెక్కించేందుకు తనకు అనుమతి అప్పుడే లభించిందని పేర్కొన్నారు. ఈ వివరణతో సంతృప్తి చెందిన దక్షిణాది సినీ రచయితల అసోసియేషన్​.. లింగుస్వామికి క్లీన్​చిట్ ఇచ్చింది.

రాయలసీయ బ్యాక్​డ్రాప్​తో ఈ కథను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రామ్​కు జోడీగా కృతిశెట్టి నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నారు. జులై 12 నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.