పైరసీని నిరోధించేదుకు సినిమాటోగ్రఫీ చట్టం,1952లో కేంద్రం మార్పులు చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అనుమతి లేకుండా సినిమాను చిత్రీకరించినా, నకళ్లు సృష్టించేందుకు ప్రయత్నిచ్చినా కఠిన శిక్షలు విధించేందుకు సిద్ధమైంది.
నిబంధనలు అతిక్రమించిన వారికి మూడేళ్లు జైలు శిక్ష లేదా పది లక్షల జరిమానా విధించనుంది.
కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడంపై నిర్మాతల మండలి సమాఖ్య హర్షం వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపింది.