ETV Bharat / sitara

'వైకుంఠపురములో..' దారిలోనే పవన్ 'పింక్‌' - పింక్​ రీమేక్​ ప్రమోషన్స్​

ఒక సినిమాను తెరకెక్కించడం కన్నా.. దాన్ని ప్రేక్షకులకు చేరవేయడంలోనే అసలైన కష్టముంటుంది. అందుకే చిత్ర ప్రమోషన్స్​ కోసం నిర్మాణసంస్థలు ప్రత్యేక పంథాను ఎంచుకుంటున్నాయి. ఈ విషయంపై నిర్మాత దిల్​రాజ్​ అదే బాటను ఎంచుకున్నట్లు సమాచారం. పవన్​కల్యాణ్​ నటిస్తున్న 'పింక్​' రీమేక్​ విడుదలకు దాదాపు రెండు నెలల ముందుగానే ప్రచారపర్వాన్ని ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.

pink remake promotions will started soon
పవన్​ కోసం కొత్త పంథాను ఎంచుకున్న దిల్​రాజు
author img

By

Published : Feb 26, 2020, 11:06 AM IST

Updated : Mar 2, 2020, 3:02 PM IST

సంక్రాంతి సూపర్​ హిట్‌గా నిలిచిన 'అల.. వైకుంఠపురములో' చిత్ర విషయంలో త్రివిక్రమ్‌ ఓ సరికొత్త పంథాను ఎంచుకుని లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఇంతకీ అతడు ఎంచుకున్న ఆ మార్గం మరేదో కాదు.. మూడు నెలలు ముందు నుంచే ఒక్కొక్కటిగా పాటలు విడుదల చేయటమే. ఇందులోని తొలి గీతం 'సామజవరగమన..'ను సినిమా విడుదలకు దాదాపు మూడు నెలల ముందుగానే ప్రేక్షకులకు చేరవేశారు. ఈ స్ట్రాటజీనే చిత్ర విజయంలో చాలా కీలకంగా మారింది.

ఇప్పుడీ చిత్ర విజయాన్ని స్ఫూర్తిగా తీసుకునే పవన్‌ కల్యాణ్‌ 'పింక్‌' రీమేక్‌ నుంచి దాదాపు రెండు నెలలు ముందుగానే తొలి పాటను విడుదల చేయనున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. తాజాగా ఈ చిత్ర స్వరకర్త తమన్‌ తన ట్వీట్‌ ద్వారా ఈ అంశంపై చిన్న క్లూ ఇచ్చేశాడు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత పవన్‌ నుంచి వస్తోన్న సినిమా కావడం వల్ల దీనిపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ క్రేజ్‌ను మరింత స్థాయికి తీసుకెళ్లాలా ముందుగానే గీతాల్ని విడుదల చేస్తే.. చిత్ర విడుదల సమయానికి ప్రచారభారం చాలా వరకు తగ్గుతుందని దిల్‌రాజు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

  • What a dream day met the person I wanted to work and make music .I played him the songs I composed 🎧
    Felt So nervous & was sweating like anything in tension love & pressure ♥️
    Finally it was all love & respect ✊
    We r coming soon with our #firstsingle

    Love u sir ♥️

    Godbless

    — thaman S (@MusicThaman) February 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దాదాపు రెండు నెలల క్రితమే తమన్‌కు త్వరితగతిన పాటలు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చేశాడట దిల్​రాజు. ఇప్పటికే ఓ పాట రికార్డింగ్‌ పూర్తయినట్లు సమాచారం. సినిమాలోని ఈ కీలక పాటను యువ సంచలనం సిద్‌ శ్రీరామ్‌ ఆలపించినట్లు తెలుస్తోంది. త్వరలో విడుదల కాబోయే తొలి పాట ఇదేనని చిత్రసీమలో ప్రచారం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

ప్రకాష్​రాజ్​ కీలకపాత్రలో

తాజాగా ఈ చిత్రం నుంచి మరో ఆసక్తికర సమాచారం బయటకొచ్చింది. ఇందులో ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రను పోషిస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం పవన్‌కి అతడికి మధ్య కోర్టు సెట్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి.. చీరంటే ఇష్టమే.. కానీ కట్టుకోవడమే భయం!

Last Updated : Mar 2, 2020, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.