ETV Bharat / sitara

'పెంగ్విన్​' చిత్రంలో తొలిపాటను విన్నారా! - keerthi suresh new movie Update

హీరోయన్​ కీర్తి సురేశ్​ ప్రధానపాత్రలో నటించిన 'పెంగ్విన్​' చిత్రం.. ఆన్​లైన్​ వేదికగా విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తొలి పాటను సోషల్​మీడియాలో ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్​ విడుదల చేశారు.

Penguin Movie First Lyrical Video Praname released
'పెంగ్విన్​' చిత్రంలో తొలిపాటను విన్నారా!
author img

By

Published : Jun 17, 2020, 5:55 AM IST

'ప్రాణమే.. నా ప్రాణమే.. మరల వచ్చిందమ్మా..' అంటున్నారు కీర్తి సురేశ్‌. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'పెంగ్విన్‌'. ఈశ్వర్‌ కార్తిక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కార్తికేయన్‌ సంతానం, సుధన్‌ సుందరం, జయరాం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని మొదటి పాటను మంగళవారం ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్​ సోషల్​మీడియా వేదికగా విడుదల చేశారు. 'ప్రాణమే..' అని సాగే ఈ గీతాన్ని కీర్తి సురేశ్‌పై చిత్రీకరించారు. అపహరణకు గురైన తన కుమారుడు అజయ్‌ను గుర్తు చేసుకుంటూ ఆమె పడే బాధను ఇందులో చూపించారు. వెన్నెల కంటి ఈ పాటకు సాహిత్యం అందించగా.. సుషా ఆలపించారు. సంతోష్‌ నారాయణ్‌ బాణీలు సమకూర్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

గతేడాది 'మన్మథుడు 2'లో అతిథి పాత్రలో కనిపించిన కీర్తి సురేశ్‌.. తాజగా 'పెంగ్విన్‌'తో తెరపై కనువిందు చేయనున్నారు. జూన్‌ 19న అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు సోషల్​మీడియాలో మంచి స్పందన లభించింది. ప్రస్తుతం 'గుడ్‌ లక్‌ సఖి', 'రంగ్‌దే', 'మిస్‌ ఇండియా' సినిమాల్లోనూ కీర్తి సురేశ్​ నటిస్తుంది.

ఇదీ చూడండి... ఏడు రోజులకు రూ.70 లక్షల రెమ్యునరేషన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.