ETV Bharat / sitara

'మాస్క్​మెన్​ గురించి టీమ్​లో ఎవరికీ తెలీదు!' - penguin movie amazon prime video

కీర్తి సురేష్​ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'పెంగ్విన్'. ఈశ్వర్​ కార్తిక్​ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్​ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతోంది. జూన్​ 19న అమెజాన్​ ప్రైమ్​లో రిలీజ్​కు సిద్ధమైన ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు దర్శకుడు కార్తిక్​. షూటింగ్​ సమయంలో మర్చిపోలేని ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు.

penguin movie director  Eeshwar karthik said interesting things while on shooting
'మాస్క్​మెన్​ గురించి టీంలో ఎవరికీ తెలీదు!'
author img

By

Published : Jun 14, 2020, 6:31 AM IST

'పెంగ్విన్‌' చిత్రంలోని మాస్క్‌ మెన్‌ గురించి టీమ్​లో ఎవరికీ తెలియదని దర్శకుడు ఈశ్వర్‌ కార్తిక్‌ అన్నారు. క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తిసురేష్ కీలకపాత్రను పోషించారు. అయితే మరికొన్నిరోజుల్లో ప్రేక్షకులను అలరించనున్న ఈ సినిమా గురించి దర్శకుడు ఈశ్వర్‌ ఆసక్తికర విశేషాలను తెలియజేశారు. షూటింగ్‌ సమయంలో కొన్ని మర్చిపోలేని ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు.

penguin movie director  Eeshwar karthik said interesting things while on shooting
పెంగ్విన్​

"పెంగ్విన్‌' కథను 18 రోజుల్లోనే రాశాం. 36 రోజుల్లోనే షూట్‌ పూర్తి చేశాం. చిత్రీకరణ‌ సమయంలో కొన్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా కొడైకెనల్‌లో షూట్‌ చేస్తున్న సమయంలో ఓరోజు సెట్‌లో ఏర్పాటు చేసిన భారీ లైట్స్‌ ప్రమాదవశాత్తు తేనేపట్టు మీద పడ్డాయి. దీంతో ఒక్కసారిగా తేనేటీగలు చిత్రబృందంపై దాడి చేశాయి. ఆ సమయంలో కీర్తి అక్కడే ఉన్నారు. ఈ ఘటనతో ఆమె భయాందోళనలకు గురయ్యారు. తేనేటీగల దాడిలో కొంతమంది సభ్యులు గాయపడిన కారణంగా కొంతసమయం షూటింగ్‌ నిలిపివేశాం. చికిత్స అనంతరం తిరిగి ప్రారంభించాం. ఈ సినిమాలోని మాస్క్‌ మెన్‌ గురించి టీంలో ఎవరికీ తెలీదు. కీర్తికి కూడా షూటింగ్‌ తర్వాతే ఆ పాత్రను ఎవరు పోషిస్తున్నారో చెప్పాం."

-ఈశ్వర్​ కార్తిక్​, దర్శకుడు

జూన్‌ 19న ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది​. థియేటర్‌లో విడుదల చేయాలని మొదట భావించినప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా ఓటీటీ వేదికగా రిలీజ్‌ చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. కార్తీక్‌ సుబ్బరాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో కీర్తి తల్లిపాత్రను పోషించారు. ఇటీవల విడుదలైన 'పెంగ్విన్‌' ట్రైలర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.