పాయల్ రాజ్‌పుత్ భారీ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకుంది. 'భారతీయుడు 2' సినిమాలో కమల్‌హాసన్ సరసన ఓ ప్రత్యేక గీతంలో చిందులేయనుంది. ఈ విషయాన్ని ఆమె సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
గతంలో శంకర్-కమల్ కలయికలో వచ్చిన 'భారతీయుడు'కు కొనసాగింపు చిత్రమిది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు.
దర్శకుడు శంకర్ తనదైన శైలిలో భారీ హంగులతో ఈ పాటను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. కరోనా పరిస్థితులు కుదుటపడగానే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
ఇది చూడండి : మీకు కోటి ధన్యవాదాలు చెప్పిన సరిపోవు: మహేశ్