పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ను వెండితెరపై చూసి సంబరాలు చేసుకునేందుకు అభిమానులు, దాదాపు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెట్టి 'వకీల్‌సాబ్'గా మన మందుకు వచ్చేస్తున్నారు. ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదలవుతోంది. దీంతో ఈ మూవీకి భారీ డిమాండ్ ఏర్పడింది.
కమర్షియల్ హంగులకు దూరంగా మహిళా సాధికారతే ప్రధానాంశంగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమా 'పింక్'కు రీమేక్‌గా దీనిని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయగా అక్కడా ప్రశంసలు అందుకుంది. మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా విశేషాలపై ఓ లుక్కేద్దాం.
హిందీలో 'పింక్', తమిళంలో 'నేర్కొండపార్వై' విజయాలు అందుకున్న తరుణంలో 'వకీల్‌సాబ్' పేరుతో అదే కథను తెలుగులోకి రీమేక్ చేశారు. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ స్టార్‌డమ్‌ను దృష్టిలో ఉంచుకుని మూలకథలో ఎలాంటి మార్పులు చేయకుండా కొన్ని కమర్షియల్ హంగుల్ని ఇందులో చేర్చారు దర్శకుడు వేణు శ్రీరామ్.
ఇక పవన్‌కు వ్యతిరేకంగా వాదించే న్యాయవాది పాత్రలో ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను తీసుకోవడం, కోర్టు రూమ్‌లో వాళ్లిద్దరి మధ్య జరిగే మాటల యుద్ధం చూసి ప్రేక్షకులు ఇప్పటికే ఈలలు వేస్తున్నారు. దీంతోపాటు ఇప్పటికే విడుదలైన మూడు పాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి.
'వకీల్‌సాబ్' విశేషాలు..
* మూడేళ్ళ తర్వాత పవన్‌కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ
* మహిళా సాధికారతే ప్రధానాంశంగా తెరకెక్కిన సినిమా
*పవన్‌లోని హీరోయిజాన్ని చూపించే సన్నివేశాలు
* అంచనాలు పెంచుతున్న ఫైట్ సీక్వెన్స్‌లు
* యంగ్ లుక్‌లో పవన్ కల్యాణ్ కనిపిస్తుండటం
*తొలిసారి న్యాయవాదిగా కనిపించనున్న పవన్
* పవన్-ప్రకాశ్ కలిసి నటించిన 'సుస్వాగతం', 'బద్రి', 'జల్సా', 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాలు ప్రేక్షకుల నుంచి విశేషాదరణ దక్కించుకున్నాయి. ఇప్పుడు 'వకీల్‌సాబ్' కోసం కోర్టులో వీరిద్దరూ వాదోపవాదాలు చేసుకున్నారు. ఇందులో ప్రకాశ్‌రాజ్ పేరు నందా. 'బద్రి'లో కూడా ఆయన పేరు నందానే కావడం ఈ సినిమాలోని మరో విశేషం.
*పవన్-శ్రుతి లవ్ ట్రాక్ ఆకట్టుకునేలా ఉండనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న మూడో చిత్రమిది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో 'గబ్బర్‌సింగ్', 'కాటమరాయుడు' వచ్చి అలరించాయి.
* నివేదా, అంజలి, అనన్య నటన ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది.
*ఇప్పటికే విడుదలైన పాటలు శ్రోతలను విపరీతంగా అలరిస్తున్నాయి.
* కేవలం అమెరికాలోనే 265పైగా థియేటర్లలో 'వకీల్‌సాబ్' విడుదల
* ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని చాలా ప్రాంతాల్లో ఈ చిత్ర ప్రదర్శన
*తొలిరోజు హైదరాబాద్‌లో దాదాపు 1000కు పైగా షోలు
లాక్డౌన్ తర్వాత టాలీవుడ్లో రిలీజ్ అవుతున్న బడా హీరో తొలి సినిమా, అత్యధిక కలెక్షన్స్ అందుకోవడమే లక్ష్యంగా బరిలో దిగుతున్న చిత్రమిదే. మరి ఇది ఏ రేంజ్లో హిట్ అవుతుందో చూడాలి?
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: "వకీల్‌సాబ్'తో ఆ కల నెరవేరింది!'