పవన్‌కల్యాణ్, రానా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం 'భీమ్లానాయక్'లోని(Bheemla Nayak Updates) రెండో పాట 'అంత ఇష్టం' ప్రోమో విడుదలైంది. అక్టోబర్ 15న ఉదయం 10.19గంటలకు పూర్తి సాంగ్ రిలీజ్ కానున్నట్లు తెలిపింది చిత్రబృందం(Bheemla Nayak Song Lyrics). త్రివిక్రమ్(Trivikram Bheemla Nayak) స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ మూవీకి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ స్వరాలను సమకూరుస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న(Bheemla Nayak Release Date) సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ట్రైలర్
'ఏక్ మినీ కథ'తో పూర్తిస్థాయి హీరోగా సంతోష్ శోభన్ ఇటీవల మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'మంచి రోజులు వచ్చాయి'(manchi rojulu vachayi movie release date). ప్రముఖ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ కథానాయిక. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను'(manchi rojulu vachayi trailer) చిత్రబృందం గురువారం(అక్టోబర్ 14) ఉదయం విడుదల చేసింది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. యూవీ క్రియేషన్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనూప్ రూబెన్స్ స్వరాలు అందించారు. నవంబర్ 4న ఈసినిమా విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
టీజర్
నవీన్‌చంద్ర, రవిశంకర్, మకరంద్ దేశ్పాండ్, పూజ గాంధీ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'తగ్గేదే లే'. గురువారం(అక్టోబర్15) ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. శ్రీనివాస్‌రాజు దర్శకుడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: squid game web series: 'స్క్విడ్‌గేమ్'కు ఎందుకింత క్రేజ్?