ETV Bharat / sitara

ట్విట్టర్​లో పవన్ ఫ్యాన్స్ హంగామా.. ప్రపంచ రికార్డు కైవసం - పవన్​ కల్యాణ్​ లేటెస్ట్​ న్యూస్​

'నేను ట్రెండ్​ ఫాలో అవ్వను.. ట్రెండ్​ సెట్​ చేస్తా' అనే పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ డైలాగ్​ను ఆయన అభిమానులూ పాటిస్తున్నారు. త్వరలో పవన్​ పుట్టినరోజు పురస్కరించుకుని ట్విట్టర్​లో సరికొత్త రికార్డు సృష్టించారు. పవన్​ పుట్టినరోజు కామన్​ డీపీ హ్యాష్​ట్యాగ్​తో ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లోనే 65 మిలియన్​ ట్వీట్లు వేశారు.

Pawan Kalyan's world record Birthday trend in twitter #PawankalyanBirthdayCDP
పవన్​ కల్యాణ్​ పేరిట మరో వరల్డ్​​రికార్డు
author img

By

Published : Aug 16, 2020, 7:59 PM IST

పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ ఫాన్స్​ మరోసారి సోషల్​ మీడియాలో సత్తా చాటారు. నెట్టింట మాస్​ సెలబ్రేషన్స్​ పేరిట ట్వీట్ల రూపంలో సునామీ సృష్టించారు. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయి ట్రెండింగ్​లో సరికొత్త రికార్డు నెలకొల్పారు పవర్​స్టార్​ ఫ్యాన్స్​. కానీ ఈసారి ట్రెండింగ్​ వేలను, లక్షలను దాటి కోట్లకు చేరింది.

ఇటీవలే టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ రికార్డును దక్కించుకోవాలని ఆయన అభిమానులు ప్రయత్నించినా..అది కొద్దిలో చేజారిపోయింది. కానీ, పవన్​ అభిమానులు కాస్త అడ్వాన్స్​గానే ఈ రికార్డును తిరగరాశారు. బర్త్​డే కామన్​ డీపీ హ్యాష్​ట్యాగ్​​తో ప్రపంచంలోనే అత్యధిక ట్వీట్ల ట్రెండ్​​ను ఆయన​ పేరిట నమోదు చేశారు.

#PawankalyanBirthdayCDP అనే హ్యాషట్యాగ్​పై 24 గంటల వ్యవధిలో 65 మిలియన్​ ట్వీట్లతో సరికొత్త రికార్డును నెలకొల్పారు పవన్​ అభిమానులు. పవన్​ కల్యాణ్​ పుట్టినరోజుకు సంబంధించిన కామన్​ డీపీ కోసమే ఇలా ఉంటే.. ఆయన పుట్టినరోజైన సెప్టెంబరు 2న పవన్​ ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.