వరుస సినిమాలతో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన 'భీమ్లానాయక్'తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రానా-పవన్‌కల్యాణ్ షూట్‌లో పాల్గొంటున్నారు. చిత్రీకరణ సమయంలో చిన్న విరామం దొరకడం వల్ల పవన్ గన్ పట్టారు. టార్గెట్‌ను ఎయిమ్ చేస్తూ బుల్లెట్ల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో చిత్రబృందం సోషల్‌మీడియాలో షేర్ చేసింది. 'భీమ్లా నాయక్ ఇన్ బ్రేక్ టైమ్' అని పేర్కొంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మలయాళం సూపర్‌హిట్ 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్‌గా 'భీమ్లా నాయక్' తీస్తున్నారు. మాతృకలోని బీజుమేనన్ పాత్రను తెలుగులో పవన్.. పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో రానా కనిపించనున్నారు. ఐశ్వర్యా రాజేశ్, నిత్యామేనన్ హీరోయిన్లు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, తమన్ స్వరాలు అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: