రాజకీయాల్లోకి వెళ్లి, దాదాపు మూడేళ్ల పాటు సినిమాలకు దూరమయ్యాడు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్. తాజాగా తన రీఎంట్రీ చిత్రం 'పింక్' రీమేక్ షూటింగ్లో పాల్గొంటున్నాడు. దీనితో పాటే దర్శకుడు క్రిష్‌తోనూ సినిమా చేయనున్నాడు. ఇదే కాకుండా మరో క్రేజీ ప్రాజెక్టుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
పవర్‌స్టార్ త్వరలో మాస్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో కలిసి పనిచేయనున్నాడట. అభిమానుల్లో ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న వీరి కాంబినేషన్లో ఇప్పటికే 'బద్రి', 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాలు వచ్చాయి. అయితే పూరీతో చేయబోయే సినిమాపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
ఇదీ చదవండి: ప్రదీప్ హీరోగా '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'