ETV Bharat / sitara

సంక్రాంతి బరిలో పవన్ 'వకీల్​సాబ్'!

కరోనాతో ప్రభావంతో 'వకీల్​సాబ్'ను వచ్చే ఏడాది సంక్రాంతికి, ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది.

author img

By

Published : Jul 2, 2020, 9:31 PM IST

సంక్రాంతి బరిలో పవన్ 'వకీల్​సాబ్'!
పవన్ 'వకీల్​సాబ్'

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ లాయర్‌గా నటిస్తున్న చిత్రం 'వకీల్‌ సాబ్‌'. ఈ కథానాయకుడు​ రీఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాను తొలుత ఈ వేసవికి తీసుకురావాలని అనుకున్నారు. అందుకు తగ్గట్లుగా శరవేగంగా షూటింగ్ జరిపారు. మార్చిలో కరోనా ప్రభావంతో లాక్​డౌన్ విధించడం వల్ల చిత్రీకరణ మధ్యలో ఆగిపోయింది. దీంతో చిత్రబృందం ప్రణాళిక అంతా మారిపోయింది. దసరాకు విడుదల చేయాలనుకున్నా అదీ కష్టంగానే మారింది. అయితే ఇప్పుడు 'వకీల్​సాబ్'ను వచ్చే సంక్రాంతి బరిలో నిలపాలని భావిస్తున్నారు.​​

ఇప్పటికే రేసులో ఉన్న దర్శకధీరుడు రాజమౌళి 'ఆర్‌ఆర్ఆర్'‌తో పాటు చిరంజీవి 'ఆచార్య', మహేశ్ 'సర్కారు వారి పాట', అల్లు అర్జున్‌ 'పుష్ప' చిత్రాలు సంక్రాంతికి వచ్చేలా కనిపించడం లేదు. అందుకే 'వకీల్‌సాబ్'ను పండగ బరిలో నిలపాలని సన్నాహాలు చేస్తున్నారు.

pawan kalyan vakeelsaab
వకీల్​సాబ్ సినిమాలో పవన్​కల్యాణ్

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫొటో ఒకటి లీక్​ అయింది. ఇందులో పవన్​ న్యాయవాది లుక్​లో అలరిస్తుండగా, పక్కనే నటి అంజలి కనిపించింది. 'వకీల్​సాబ్'కు వేణు శ్రీరామ్ దర్శకుడు. దిల్​రాజు నిర్మిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.