ETV Bharat / sitara

ప్రభాస్​ను సర్​ప్రైజ్ చేసిన పవన్​ కల్యాణ్! - ప్రభాస్ ప్రాజెక్టు k

Pawan kalyan prabhas: అగ్రకథానాయకుడు పవన్​.. యంగ్​ రెబల్​స్టార్ ప్రభాస్​ను సర్​ప్రైజ్ చేశారు. మరోవైపు 'భీమ్లా నాయక్' విశేషాలను పవన్​ను అడిగి తెలుసుకున్నారు అమితాబ్. ఇంతకీ ఇది ఎప్పుడు ఎక్కడ జరిగిందంటే?

Pawan Kalyan Prabhas
ప్రభాస్​ పవన్​ కల్యాణ్
author img

By

Published : Feb 17, 2022, 5:33 PM IST

Prabhas Project K movie: డార్లింగ్ ప్రభాస్​ను పవర్​స్టార్ పవన్​ కల్యాణ్ సర్​ప్రైజ్ చేశారు. గురువారం, వీరిద్దరూ రామోజీ ఫిల్మ్​సిటీలో షూటింగ్​లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పై సంఘటన జరిగింది!

తన సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత పవన్..​ 'ప్రాజెక్టు k' సెట్​లోకి వెళ్లారు. అక్కడ ఉన్న హీరో ప్రభాస్- బిగ్​బీ అమితాబ్​తో కాసేపు ముచ్చటించినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు కలిసి బ్రేక్​ఫాస్ట్​ కూడా చేశారని సమాచారం. దీంతో పాటే అమితాబ్.. పవన్​ను 'భీమ్లా నాయక్' సినిమా గురించి కూడా అడిగారట. ఈ సినిమా ఫిబ్రవరి 25న తెలుగుతో పాటు హిందీలోనూ థియేటర్లలో రిలీజ్ కానుంది.

Prabhas Pawan Kalyan amitabh
ప్రభాస్-పవన్-అమితాబ్

సైన్స్ ఫిక్షన్ కథతో తీస్తున్న 'ప్రాజెక్టు k'లో ప్రభాస్-అమితాబ్​తో పాటు దీపికా పదుకొణె ప్రధాన పాత్రలో నటిస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తిస్థాయి గ్రాఫిక్స్​తో ఈ సినిమా తీస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.

'భీమ్లా నాయక్'తో రిలీజ్​కు రెడీ అయిన పవన్.. 'హరిహర వీరమల్లు' షూటింగ్​కు సిద్ధమవుతున్నారు. 'భవదీయుడు భగత్​సింగ్' చిత్రీకరణకూ రెడీ అవుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.