దర్శకుడిగా సురేందర్ రెడ్డి... రచయితగా వక్కంతం వంశీ కలిసి చేసిన సినిమాలు చక్కటి విజయాల్ని సొంతం చేసుకున్నాయి. 'కిక్', 'రేసుగుర్రం'తో అందరికీ వినోదాల్ని పంచారు. పవన్ కల్యాణ్‌తో సినిమా కోసం మరోసారి ఆ ఇద్దరూ కలిసి పనిచేయనున్నారు.
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా దాదాపు ఖరారైనట్టే. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వక్కంతం వంశీ రాసిన కథతోనే ఈ చిత్రం తెరకెక్కబోతోంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ప్రకటించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆయన 'వకీల్‌సాబ్' చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత క్రిష్, హరీష్ శంకర్, సురేందర్‌రెడ్డిలతో వరుసగా సినిమాలు చేయనున్నారు పవన్‌కల్యాణ్.