ETV Bharat / sitara

ఫ్యాన్స్​కు పవన్​ బిగ్ సర్​ప్రైజ్.. ఈసారి 'భీమ్లా నాయక్​'తో! - భీమ్లా నాయక్ హీరోయిన్

Bheemla nayak songs: స్టార్ హీరో పవన్​కల్యాణ్.. మరోసారి అభిమానులు బిగ్ సర్​ప్రైజ్​ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ అదేంటి? దాని సంగతేంటి?

pawan kalyan bheemla nayak movie
పవన్​ కల్యాణ్ భీమ్లా నాయక్ మూవీ
author img

By

Published : Dec 4, 2021, 3:35 PM IST

Pawan kalyan songs: పవర్​స్టార్ పవన్​కల్యాణ్ ఫ్యాన్స్​కు అదిరిపోయే న్యూస్. 'భీమ్లా నాయక్'లో ఓ ప్రత్కేక గీతం పాడనున్న పవన్..​ మరోసారి తన గానంతో అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ప్రేక్షకులకు, అభిమానులకు కిక్కే కిక్.

ఈ స్పెషల్ మ్యూజిక్​ బిట్​ను తమన్ ఇప్పటికే కంపోజిషన్​ చేశాడని.. త్వరలో దీనిని రికార్డు చేయనున్నట్లు తెలుస్తోంది. అలానే సినిమా రిలీజ్​ తేదీకి కొన్నిరోజుల ముందు ఈ పాటను విడుదల చేస్తారని సమాచారం.

పవన్​ కల్యాణ్ ఇప్పటివరకు ఎనిమిదిసార్లు సినిమాల్లో పాటలు పాడారు. తమ్ముడు(ఏం పిల్ల మాట్లడవా..), తమ్ముడు(తాటి చెట్టు ఎక్కలేవు..), ఖుషీ(బైబయ్యే బంగారు రవణమ్మ), జానీ(నువ్వు సారా తాగుతా..), జానీ(రావోయి మా ఇంటికి..), పంజా(పాపారాయుడు..), అత్తారింటికి దారేది (కాటమరాయుడా..), అజ్ఞాతవాసి(కొడకా కోటేశ్వరరావు..) ఈ జాబితాలో ఉన్నాయి.

మలయాళ హిట్​ 'అయ్యప్పనుమ్ కోశియమ్' చిత్రానికి రీమేక్​గా 'భీమ్లా నాయక్'ను తెరకెక్కిస్తున్నారు. పవన్​ కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్నారు. నిత్యామేనన్, సంయుక్త హీరోయిన్లు. తమన్ సంగీతమందిస్తున్నారు. త్రివిక్రమ్.. స్క్రీన్​ప్లే-మాటలు అందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.