ETV Bharat / sitara

'వకీల్​సాబ్'​లో పవన్ మార్క్ సాంగ్! - వకీల్ సాబ్ సత్యమేవ జయతే సాంగ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న 'వకీల్ సాబ్' చిత్రంలోని రెండో పాట త్వరలోనే విడుదల కానుంది. పవన్ సామాజిక దృక్పథాన్ని ప్రతిబింబించేలా ఈ సాంగ్ ఉండనుందట.

Pawan kalyan mark song in Vakeelsaab
'వకీల్​సాబ్'​లో పవన్ మార్క్ సాంగ్!
author img

By

Published : Mar 2, 2021, 12:45 PM IST

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం వరుసపెట్టి చిత్రాలు చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. ప్రస్తుతం పవన్ నటించిన 'వకీల్​సాబ్' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలోని రెండో పాటను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది చిత్రబృందం. అయితే ఈ సాంగ్ సమాజం పట్ల పవన్​కు ఉన్న దృక్పథాన్ని ప్రతిబింబించేలా ఉంటుందట.

పవన్ ఇప్పటివరకు చేసిన చిత్రాల్లో సమాజం పట్ల ఉన్న బాధ్యతను తెలిపేలా సామాజిక అంశాలపై ఓ పాట కచ్చితంగా ఉంటుంది. బద్రి, జానీ, ఖుషి, జల్సా ఇలా చాలా చిత్రాల్లో అటువంటి పాటలు ఉన్నాయి. తాజాగా పవన్ నుంచి రాబోతున్న 'వకీల్​సాబ్​'లోనూ ఇలాంటి సాంగ్​నే పెట్టారట. ఇందులోని రెండో పాట 'సత్యమేవ జయతే'ని త్వరలోనే విడుదల చేయనున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ పరోక్ష అప్​డేట్​ను సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్​లో పంచుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.