నిహారిక-చైతన్యల పెళ్లికి హాజరయ్యేందుకు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఉదయ్‌పూర్‌కు బయలుదేరారు. ఆయన గత కొన్ని రోజులుగా పర్యటనలు, నిరసనలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తన సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లికి హాజరవుతారా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. కానీ తన తమ్ముడు వస్తున్నాడని తెలుపుతూ నాగబాబు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేశారు.
![Pawan Kalyan heads to Udaipur for Niharika and Chaitanya's wedding](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9811517_1.jpg)
మరోవైపు పెళ్లి కూతురు నిహారిక పూల్ పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం ఈ పార్టీని నిర్వహించారు. ఈ సందర్భంగా కునాల్ రావల్ రూపొందించిన లావెండర్ గౌనులో నిహారిక తళుక్కుమన్నారు. ఈ పార్టీలో తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వరుణ్ తేజ్ తన చెల్లెలు నిహారిక పెళ్లి ఏర్పాట్లు ఘనంగా నిర్వహించాడని అల్లు అర్జున్ అన్నారు. 'నా సోదరుడి పట్ల ఎంతో గర్వపడుతున్నా' అని ఫొటో షేర్ చేశారు. అంతేకాదు తన సతీమణి స్నేహారెడ్డి సంగీత్ పార్టీలో అందంగా కనిపించిందని ఆమె స్టిల్ పంచుకున్నారు.
![Pawan Kalyan heads to Udaipur for Niharika and Chaitanya's wedding](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9811517_3.jpg)
![Pawan Kalyan heads to Udaipur for Niharika and Chaitanya's wedding](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9811517_2.jpg)