ETV Bharat / sitara

రేణూ దేశాయ్​ ఈజ్​ బ్యాక్​.. వెబ్​సిరీస్​కు గ్రీన్​సిగ్నల్​ - renudesai acting in webseries

నటి రేణూ దేశాయ్​.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా ఓ వెబ్​సిరీస్​లో నటించేందుకు అంగీకారం తెలిపారు. ఈ మేరకు ఇన్​స్టాలో ఓ ఫొటో పోస్ట్​ చేశారు.

renu desai
రేణూ దేశాయ్
author img

By

Published : Sep 20, 2020, 5:48 PM IST

నటి రేణూ దేశాయ్‌ మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. తను ఓ అందమైన వెబ్‌ సిరీస్‌కు సంతకం చేసినట్లు ప్రకటించారు. త్వరలో తన ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఫొటోషూట్‌లో తీసిన ఓ స్టిల్‌ను షేర్‌ చేశారు.

"మళ్లీ కెమెరా ముందుకు రావడం చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంది. వచ్చే నెల సిరీస్‌ షూటింగ్‌ పూర్తిస్థాయిలో ప్రారంభం కాబోతోంది. ఈ ప్రయాణంలో మీ అందరి ఆశీర్వాదాలు, ప్రేమ నాకు కావాలి. నిజం, న్యాయం కోసం పోరాడే ఓ బలమైన మహిళ కథ ఇది. సాయికృష్ణ ప్రొడక్షన్స్‌ పతాకంపై డీఎస్‌ రావు, ఎస్‌.రజనీకాంత్‌ నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఆర్‌.కృష్ణ మామిడాల దర్శకుడు. శివేంద్ర డీవోపీగా పనిచేస్తున్నారు" అని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమెకు అభిమానులు‌ శుభాకాంక్షలు తెలుపుతూ.. వెబ్‌ సిరీస్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.

రేణు నటిగానే కాకుండా దర్శకురాలిగానూ గుర్తింపు పొందారు. బద్రి, జేమ్స్‌ పండు, జానీ సినిమాల్లో నటించారు. ఇష్క్‌ వాలా లవ్‌ అనే సినిమాను నిర్మించారు. పవన్‌ కల్యాణ్‌ నటించిన ఐదు సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేశారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో బలమైన పాత్రల్లో నటించే అవకాశం వస్తే చేస్తానని అన్నారు. ప్రస్తుతం రేణు రైతుల జీవితాలు, వారి సమస్యలపై సినిమా తీస్తున్నారు. దీనికి అన్నదాత సుఖీభవ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి పాటలు రాయిస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం ఆమె పల్లెటూళ్లకు వెళ్లి.. అక్కడి పరిస్థితుల్ని తెలుసుకుంటున్నారు.

ఇదీ చూడండి డ్రగ్స్​ కేసు : మరో నిందితుడు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.