గత కొన్ని రోజులుగా రాజకీయాలతో బిజీగా ఉన్న అగ్రహీరో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్.. రీఎంట్రీలో భాగంగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. 'వకీల్‌సాబ్' చిత్రీకరణ దాదాపు పూర్తి చేసుకుంది. మే నెలలో విడుదల చేయాలని చిత్ర భావించారు. అయితే కరోనా వల్ల ఆ తేదీ మారే అవకాశముంది. క్రిష్ దర్శకత్వంలోనూ పవన్ ఓ సినిమా చేస్తున్నారు. చారిత్రక కథతో తీస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన మరో విషయం, మెగా బ్రదర్ నాగబాబు చెప్పడం చర్చనీయాంశమైంది.
పవన్‌క కొత్త సినిమాల గురించి అప్‌డేట్ చెప్పమని, సోషల్ మీడియాలో ఓ అభిమాని నాగబాబును ప్రశ్నించాడు. అయితే చిత్రానికి సంబంధించిన విషయాలు తనకు ఆలస్యంగా తెలుస్తాయని, వాట్సాప్‌ల్లో, సోషల్‌మీడియాలో త్వరగా వ్యాప్తి చెందుతాయని నాగబాబు అన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
"నాకు తెలిసినంతవరకూ పవన్-క్రిష్‌ల కాంబినేషన్లో వస్తున్న సినిమా మొగలాయిల కాలం నాటి కథతో తీస్తున్నారు. ఆ సమయంలోని ఆంధ్రప్రదేశ్ వారియర్ కథ అని అంటున్నారు. కోహినూర్ వజ్రం నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. టైటిల్ నాకు తెలియదు. నేను ఈ చిత్రం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా" అని చెప్పారు నాగబాబు. అయితే సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలనే నాగబాబు చెప్పారా? లేక కథ మెయిన్ పాయింట్ చెప్పేశారా?అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.
'వకీల్‌సాబ్' గురించి మాట్లాడిన నాగబాబు.. హిందీలో అమితాబ్, తమిళంలో అజిత్ చేసిన సినిమాల కన్నా ఇందులో ఇంకొన్ని పాయింట్లు అదనంగా జోడించినట్లు చెప్పారు. వాటికన్నా ఇది ఇంకా బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి : ముద్దుగుమ్మ శ్రియ భర్తకు కరోనా!