'గబ్బర్ సింగ్' చిత్రంతో సూపర్‌హిట్ అందుకున్న పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో మరో చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో పవన్.. ఇంటెలిజెన్స్ (ఐబీ) అధికారి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. క్లైమాక్స్‌లో ఆ విషయం రివీల్ అవుతుందని తెలుస్తోంది. ఇందులో పవన్ సరసన హీరోయిన్గా పూజా హెగ్డేను పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో ఇప్పటికే విడుదలైన 'గబ్బర్ సింగ్' చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లను కొల్లగొట్టింది. మరోసారి వీరిద్దరూ కలిసి చేయబోతున్న 'పీఎస్పీక్ 28'పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
పవన్ నటిస్తున్న కొత్త సినిమా 'వకీల్‌సాబ్' చిత్రీకరణ ఇటీవలే పూర్తైంది. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు హరీశ్ శంకర్ చిత్రాన్ని కూడా త్వరలోనే పట్టాలెక్కించనున్నారని తెలుస్తోంది.
ఇదీ చూడండి: 'కేజీఎఫ్ 2' టీజర్ కౌంట్‌డౌన్.. ట్రైలర్‌తో 'త్రిభంగ'