ETV Bharat / sitara

నటనే వద్దనుకుంది.. స్టార్​ హీరోయిన్​గా ఎదిగింది! - parineeti chopra birthday special

తనదైన నటనతో అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకుంది బాలీవుడ్​ హీరోయిన్​ పరిణీతి చోప్రా. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.

parineeti chopra
పరిణీతి చోప్రా
author img

By

Published : Oct 22, 2020, 5:31 AM IST

అమ్మాయి చాలా అందంగా ఉంది. హీరోయిన్‌ అయితే మాత్రం తిరుగుండదు. పరిణీతి చోప్రాను చూసి చాలా మంది ఇలాగే అన్నారు. కానీ ఆ అమ్మాయికి మాత్రం సినిమాలంటే ఇష్టం లేదు. ఇంతంత మేకప్‌ వేసుకుని ఎలా తిరుగుతారో చూడు.. అంటూ కామెంట్‌ చేసింది. వరుసకు అక్క అయిన ప్రియాంక చోప్రా ముందు కూడా ఇలాగే అనేది. కానీ క్రమంగా అక్క వెనకాలే తిరుగుతూ పరిశ్రమకు దగ్గరైంది. సినిమా రంగంపై తన అభిప్రాయాన్ని మార్చుకుని కెమెరా ముందుకొచ్చింది. తొలినాళ్లలో అక్కచాటు చెల్లి అనిపించుకున్న ఈమె.. ఇప్పుడు అక్కను మించిన సోదరిగా గుర్తింపు తెచ్చుకుంటోంది! నేడు పరిణీతి 33వ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం.

parineeti chopra
తల్లిదండ్రులతో పరిణీతి చోప్రా

అంబాలా నుంచి..

పంజాబీ కుటుంబానికి చెందిన పరిణితి.. హరియాణాలోని అంబాలాలో(1988 అక్టోబర్​ 22) పుట్టి పెరిగింది. తండ్రి పవన్‌ చోప్రా. ఆర్మీ కంటోన్మెంట్​కు సప్లయర్‌గా వ్యవహరిస్తూ ఉండేవారు. ఆయనకు రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. తల్లి రీనా చోప్రా గృహణి. పరిణీతి చోప్రా.. కాన్వెంట్‌ ఆఫ్‌ జీసస్‌ అండ్‌ మేరీలో చదువుకుంది. పరిణీతికి శివసింగ్‌ చోప్రా, సరజ్‌ చోప్రా సోదరులు.

మూడు డిగ్రీలు..

ఇన్వెస్ట్​మెంట్‌ బ్యాంకర్‌ కావాలనేది పరిణీతి లక్ష్యం. అందుకోసం లండన్‌ వెళ్లింది. ప్రఖ్యాత మాంచెస్టర్‌ బిజినెస్‌ స్కూల్‌లో ఫైనాన్స్, ఎకనామిక్స్, బిజినెస్‌లలో ట్రిపుల్‌ హానర్స్‌ డిగ్రీ చేసింది. మార్కెటింగ్‌లో ఇంటర్న్‌ షిప్‌ చేసింది. బ్యాంకింగ్‌ రంగంలో మంచి కొలువు కోసం ప్రయత్నించింది.

parineeti chopra
పరిణీతి చోప్రా

యశ్‌రాజ్‌లో ఉద్యోగం..

'ప్యార్‌ ఇంపాజిబుల్‌' చిత్రంలో ప్రియాంక చోప్రా నటిస్తున్నప్పుడు ఆమెతో కలిసి పరిణీతి, యశ్‌రాజ్‌ ఫిల్మ్స్ సంస్థకు వెళ్లింది. అక్కడి పబ్లిక్‌ రిలేషన్స్‌ విభాగానికి చెందిన ముఖ్యులకు పరిణీతిని పరిచయం చేసింది ప్రియాంక. మార్కెటింగ్‌ మంచి అనుభవం ఉండడం వల్ల యశ్‌రాజ్‌ సంస్థలో పబ్లిక్‌ రిలేషన్స్‌ కన్సల్టెంట్‌ ఉద్యోగిగా మారింది పరిణీతి. తనకు తగిన ఉద్యోగమే దొరికిందని తొలినాళ్లలో ఈమె చెప్పేదట.

నటన ఇష్టం లేదు...

నటన, నటులు అన్నా సరే పరిణీతి చోప్రాకు అస్సలు ఇష్టం ఉండేది కాదట. అయితే యశ్‌రాజ్‌ సంస్థలో చేరాక మాత్రం.. తన అభిప్రాయం మారింది. నటనపై మక్కువతో పాటు నటీనటులపై గౌరవం పెంచుకుంది. బ్యాండ్‌ బాజా బరాత్‌ సినిమాకు ప్రమోషన్‌ వ్యవహారాలు సాగుతున్న సమయంలో పరిణీతి నటిగా మారాలని నిర్ణయించుకుంది. యశ్‌రాజ్‌ సంస్థలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఫిల్మ్‌ స్కూల్‌లో చేరి శిక్షణ తీసుకుంది.

parineeti chopra
పరిణీతి చోప్రా ప్రియాంక చోప్రా

ఒప్పందం కుదిరింది..

తాను ఉద్యోగం చేసిన యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ సంస్థ నుంచే నటిగా పరిచయమైంది పరిణీతి. జబ్‌ వుయ్‌ మెట్‌ సినిమాలో గీత పాత్రను అనుకరిస్తూ కెమెరా ముందు కొన్ని సన్నివేశాలు చేసింది పరిణీతి. ఆ వీడియోను చూసిన ఆదిత్య చోప్రా.. లేడీస్‌ వర్సెస్‌ రిక్కీబాల్‌ సినిమా కోసం ఈమెను ఎంపిక చేశారు. దీంతో పాటు మరో రెండు చిత్రాల్లో నటించేందుకు ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నారు. లేడీస్‌ వర్సెస్‌ రిక్కీబాల్‌ చిత్రంలో రణ్‌వీర్‌సింగ్, అనుష్క శర్మలతో కలిసి కీలక పాత్ర చేసింది. తొలి చిత్రంతోనే పరిణీతి నటన బాలీవుడ్‌ వర్గాలను ఆకట్టుకుంది. పలువురు విమర్శకులు ఈమె నటనను మెచ్చుకున్నారు.

చేతి నిండా సినిమాలు..

యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌తో ఒప్పందం పూర్తయ్యాక ఆమె ఒప్పుకున్న తొలి చిత్రం దావత్‌ ఎ ఇష్క్‌.. కరణ్‌జోహార్, అనురాగ్‌ కశ్యప్‌ కలిసి నిర్మించారు. యశ్‌రాజ్‌ మరో ఫిలిమ్‌ కిల్‌దిల్‌లోనూ నటించింది. జాన్‌ అబ్రహాం, వరుణ్‌ధావన్‌ హీరోలుగా చేసిన 'డిష్యూమ్‌'లో ప్రత్యేక పాత్రలో మెరిసింది.

parineeti chopra
పరిణీతి చోప్రా

వరుస విజయాలు..

యశ్‌రాజ్‌ సంస్థలో వరుసగా మూడు సినిమాలు చేసింది పరిణీతి. లేడీస్‌ వర్సెస్‌ రిక్కీబాల్‌తో పాటు ఇష్క్ జాదే, శుద్ద్‌ దేశీ రొమాన్స్‌ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. దీంతో బాలీవుడ్​లో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా మారింది. చాలామంది దర్శక నిర్మాతలు ఈమె కోసం క్యూ కట్టారు. ఇష్క్ జాదేలో నటనకుగాను ఆమె పేరు జాతీయ అవార్డుల వేదికపై ప్రస్తావించారు.

ముద్దులే ముద్దులు

అందాలపై ఆధారపడటం కాకుండా.. తొలి నుంచీ నటనకు ప్రాధాన్యమిస్తూ ప్రయాణం చేస్తోంది పరిణీతి. బికీనీలు ధరించడానికి, ముద్దు సన్నివేశాల్లో నటించడానికి నేనెప్పుడూ దూరంగా ఉంటానని తొలినాళ్లలో చెప్పుకొచ్చేది. అయితే ‘శుద్ద్‌ దేశీ రొమాన్స్‌’ చిత్రంలో మాత్రం అమ్మడు ముద్దులతో కుర్రకారు మతిపోగొట్టింది. వాణీకపూర్‌తో పోటీపడి మరీ హీరో సుశాంత్​కు ముద్దులు పెట్టింది. ఆ విషయం గురించి బాలీవుడ్‌లో కొన్నాళ్లపాటు పెద్ద ఎత్తున చర్చసాగింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మరికొన్ని సంగతులు

  • ఇంట్లో వాళ్లు ముద్దుగా తిషా అని పిలుస్తారట.
  • ఖాళీ సమయాల్లో డ్యాన్స్, మ్యూజిక్‌ వింటూ ఉంటుందట. భాష ఏదైనా సరే అన్ని సినిమాలు చూస్తూ, వాటిల్లో వచ్చే సన్నివేశాలను సరదగా ఆస్వాదిస్తుందట.
  • ఇష్టమైన నటులు సైఫ్‌ అలీఖాన్, ప్రియాంక చోప్రా. తెరపై సైఫ్‌ను చూస్తున్నంత సేపూ నాకు ఏదో తెలియని ఓ అనుభూతి. ప్రియాంక చోప్రా నా అక్క అని చెప్పడం లేదు కానీ నిజంగా ఆమె నటనలో హుషారు నన్ను బాగా ఆకట్టుకుంటుంది. ప్రతి సన్నివేశాన్నీ లీనమై చేస్తుంటుంది.
  • నన్ను పరిశ్రమలో చుల్‌బుల్‌ గర్ల్‌ అని పిలుస్తారు. ఆ మాట విన్నడప్పుడల్లా నవ్వొస్తుంటుంది.
  • నా విజయం వెనుక నా శరీరాకృతి, చిరునవ్వు ఉన్నాయని నమ్ముతుంటాను.
  • రకరకాల వంటకాలను రుచి చూడడమంటే నాకు చాలా ఇష్టం. పంజాబీ అమ్మాయిని కాబట్టి.. పంజాబీ వంటకాలను ఆరగించడానికి ఇష్టపడతాను.
  • వీకెండ్‌ పార్టీలంటే భలే సరదా. ఆ రోజుతో వారం పాటు పడిన కష్టమంతా మరచిపోతుంటాను.

ఇదీ చూడండి దీపిక.. అందాల చంద్రిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.