ETV Bharat / sitara

మేం కాదు వాళ్లే నిజమైన హీరోలు: పరేశ్ రావల్ - పరేశ్ రావల్ తాజా వార్తలు

భారత సైనికులు, పోలీసులు మాత్రమే నిజమైన హీరోలని చెప్పిన పరేశ్ రావల్.. నటులు కేవలం 'ఎంటర్​టైనర్స్' అని అన్నారు.

'సరిహద్దుల్లో పనిచేసేవారు నిజమైన హీరోలు'
బాలీవుడు నటుడు పరేశ్​రావల్
author img

By

Published : Jun 24, 2020, 11:30 AM IST

భారత సైనికులు, పోలీసులపై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్​ నటుడు పరేశ్ రావల్.. వాళ్లే నిజమైన హీరోలని అన్నారు. సినిమాల్లో నటించే తాము 'ఎంటర్​టైనర్స్' మాత్రమేనని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్​లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

  • We Should Start Calling Actors As 'Entertainers' And Our Army & Police As 'Heroes' for Our Next Generation To Know The Actual Meaning Of Real Heroes !!!

    — Paresh Rawal (@SirPareshRawal) June 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మనం నటుల్ని కేవలం 'ఎంటర్​టైనర్స్' అని పిలవాలి. ఆర్మీ-పోలీసు వారిని హీరోలు అని అనాలి. లేదంటే నిజమైన హీరోలెవరో వచ్చేతరానికి తెలియకుండా పోతుంది" -పరేశ్ రావల్ ట్వీట్

దీనికి 5 లక్షల మంది నెటిజన్లు లైకులు కొట్టారు. ఇటీవలే చైనాతో జరిగిన సరిహద్దు వివాదంలో 20 మంది భారత జవానులు వీరమరణం చెందారు. ఈ నేపథ్యంలోనే పరేశ్ రావల్ సదరు ట్వీట్ చేశారు.

పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న పరేశ్ రావల్.. ప్రస్తుతం భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్నారు. అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.