ETV Bharat / sitara

'అక్కడ 'న్యూటన్​'ను ప్రదర్శించడం సంతోషకరం'

బిహార్​ ఎన్నికలకు విధులు నిర్వర్తిస్తున్న అధికారుల శిక్షణలో తాను నటించిన 'న్యూటన్​' చిత్రాన్ని ప్రదర్శించడం పట్ల నటుడు పంకజ్ త్రిపాఠి హర్షం వ్యక్తం చేశాడు. మూడేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ అనేక మంది ప్రశంసలు పొందుతుండటం సంతోషానిచ్చిందని తెలిపాడు.

Pankaj Tripathi on 'Newton' being screened for Bihar polling officers on election duty
'న్యూటన్​' సినిమా ప్రదర్శనపై నటుడి హర్షం
author img

By

Published : Nov 5, 2020, 9:03 PM IST

బిహార్​ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులకు శిక్షణలో భాగంగా 'న్యూటన్'​ చిత్రాన్ని ప్రదర్శించినందుకు బాలీవుడ్​ నటుడు పంకజ్​ త్రిపాఠి హర్షం వ్యక్తం చేశాడు. ఎన్నికల్లో పాల్గొనే అధికారుల సమస్యల నేపథ్యంలో రూపొందిన చిత్రంతో అధికారుల్లో స్ఫూర్తి నింపుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపాడు. 2017లో విడుదలైన ఈ చిత్రంలో రాజ్​కుమార్​ రావ్​ ప్రధానపాత్రలో నటించగా.. పంకజ్​ త్రిపాఠి కీలకపాత్ర పోషించాడు.

"సినిమా కథలకు అతీతంగా ఎవరినైనా ప్రభావితం చేసేంత వరకు.. మనం అభిమానులకు చేరవయ్యామని ఎప్పటికీ తెలియదు అనుకుంట. బిహార్​లో 2500 మంది ఎన్నికల అధికారులకు శిక్షణలో 'న్యూటన్' చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సినిమాను ప్రదర్శించిన అధికారితో నేను మాట్లాడాను. ఇది ఈరోజు వరకు ప్రజల ఆదరణ పొందుతుంటడం చాలా సంతోషాన్నిచ్చింది. ముఖ్యంగా ఎన్నికల విధుల నుంచి తప్పుకోవాలని ప్రయత్నించేవారికి ఇది స్ఫూర్తినిస్తుంది. ​మూడేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు చాలా ప్రభావాన్ని చూపింది. నేను నటించిన చిత్రాల్లో కష్టపడి పని చేయడానికి ఈ సినిమా నన్ను ప్రేరేపిస్తుంది. మెరుగైన సమాజాన్ని సృష్టించడంలో ప్రజలకు ఇది దోహదపడుతుంది".

- పంకజ్​ త్రిపాఠి, బాలీవుడ్​ నటుడు

కథేంటంటే?

అమిత్​ వి. మసూర్కర్​ రూపొందించిన 'న్యూటన్' చిత్రం.. 2018లో భారతదేశం నుంచి ఆస్కార్స్​ ఎంపికైంది. ఇందులో అంజలి పాటిల్​, రఘుబీర్​ యాదవ్​లతో పాటు ఎన్నికల రిటర్నింగ్​ అధికారిగా రాజ్​కుమార్​ రావ్​ నటించాడు. ఎన్నికల విధుల్లో భాగంగా అతడిని నక్సల్స్​ ప్రభావిత ప్రాంతంలో విధులను కేటాయిస్తారు. ఆ పోలింగ్ బూత్​ వద్ద సెంట్రల్​ రిజర్వ్​ పోలీస్​ ఫోర్స్​ (సీఆర్పీఎఫ్​) అసిస్టెంట్​ కమాండెంట్​గా పంకజ్​ త్రిపాఠి కూడా భద్రతా అధికారిగా నియమిస్తారు. నక్సల్స్​ ప్రభావిత ప్రాంతంలో ఈ అధికారులు పోలింగ్​ ఏ విధంగా ముగించారనే నేపథ్యంతో ఆద్యంతం ఉత్కంఠతో తెరకెక్కింది.

బిహార్​ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికారుల్లో స్ఫూర్తిని నింపడానికి వారి శిక్షణలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. దీనిపై నటుడు పంకజ్​ త్రిపాఠి హర్షం వ్యక్తం చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.