గతేడాది పెళ్లి చేసుకున్న హీరోయిన్ కాజల్.. భర్త గౌతమ్‌తో కలిసి వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది. మరోవైపు పలు భాషల్లో సినిమాలు చేస్తూ, కెరీర్లోనూ దుసుకెళ్తోంది. అయితే రెండో దశ లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉన్న ఈ ముద్దుగుమ్మ.. అత్తయ్య దగ్గర నుంచి చాలా కొత్త విషయాలు నేర్చుకుందట. కుట్లు, అల్లికలను నేర్చుకున్న కాజల్.. ప్రతిరోజూ ధ్యానం కూడా ప్రాక్టీసు చేస్తోందట.
అయితే లాక్డౌన్ వల్ల తనకు చాలా విషయాలు నేర్చుకున్నానని కాజల్ చెప్పింది. కుటుంబం, రిలేషన్షిప్, సెల్ఫ్ లవ్‌కు ఉన్న ప్రాధాన్యం అర్ధమైందని తెలిపింది.
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, నాగార్జునతో ఓ యాక్షన్ థ్రిల్లర్, హిందీ సినిమా ఉమ, తమిళంలో 'ఘోష్టీ' చిత్రంతో పాటు మరో రెండు సినిమాల్లోనూ కాజల్ నటిస్తోంది.
అయితే ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత కాజల్.. నటనకు గుడ్‌బై చెబుతుందనే వార్తలు గతంలో వచ్చాయి. తన భర్త గౌతమ్ ఎప్పుడు చెబితే అప్పుడే సినిమాలకు వీడ్కోలు పలుకుతానని కాజల్ స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: