ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కీలకపాత్రలో స్వాతి రెడ్డి, సముద్రఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'పంచతంత్రం'. హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. నిత్యం జీవితంలో మనకు ఎదురయ్యే ఎన్నో కథలను ఆధారంగా చేసుకుని ఈ ఫీల్ గుడ్ చిత్రాన్ని తెరకెక్కించామని చిత్రబృందం చెబుతోంది. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'షెహ్జాదా'. అల్లు అర్జున్ హీరోగా నటించిన 'అల వైకుంఠపురములో' చిత్రానికి హిందీ రీమేక్ ఈ సినిమా. బాలీవుడ్లో రోహిత్ ధావన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటోన్న ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను ఖరారు చేశారు. వచ్చ ఏడాది నవంబర్ 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు.

సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా మారుతి తెరకెక్కించిన యూత్‌ఫుల్ లవ్, కామెడీ ఎంటర్టైనర్ 'మంచిరోజులు వచ్చాయి'. నవంబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలల్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రబృందం. గురువారం (అక్టోబర్ 14) ఉదయం 9 గంటలకు ఈ ప్రచార చిత్రాన్ని రిలీజ్ చేయటనున్నట్లు వెల్లడించింది.
