కరోనా క్లిష్ట పరిస్థితుల్లో తన సినిమా 'పాగల్'ను విజయవంతం చేసిన ప్రేక్షకులకు యువ కథానాయకుడు విశ్వక్ సేన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. 50 శాతం ప్రేక్షకులతో థియేటర్లలో సినిమా ప్రదర్శన కొనసాగినా తన గత చిత్రం 'హిట్' కంటే 40 శాతం వసూళ్లు అధికంగా సాధించినట్లు విశ్వక్ సేన్ వెల్లడించాడు.
హైదరాబాద్‌లోని ఓ హోటల్లో చిత్ర నటీనటులు, నిర్మాత బెక్కం వేణుగోపాల్‌తో కలిసి 'పాగల్' చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు విశ్వక్ సేన్ కృతజ్ఞతలు తెలిపాడు. లక్కీ మీడియా పతాకంపై నరేశ్ కుప్పిలి దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో నివేదా విశ్వక్‌కు జోడిగా నటించగా మురళీశర్మ కీలక పాత్ర పోషించాడు.
ఇవీ చదవండి: