లవర్‌బాయ్‌గా విశ్వక్ సేన్ నటించిన చిత్రం 'పాగల్'. నివేదా పేతురాజ్ కథానాయిక. సిమ్రన్ చౌదరి, మేఘాలేఖ, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నరేశ్ కొప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ని విడుదల చేసింది. 'నా పేరు ప్రేమ్. నేను 1600 మంది అమ్మాయిల్ని ప్రేమించాను' అని విశ్వక్ చెప్పిన డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ అలరిస్తూనే భావోద్వేగానికి గురిచేస్తోంది. ఎప్పుడూ స్నేహితులతో సరదాగా తిరుగుతూ అమ్మాయిల గురించి ఆలోచించే విశ్వక్‌కి సడెన్‌గా నాయిక నివేదా పరిచయమవుతుంది. అంతే.. తన జీవితం మారిపోతుంది. 'చూడు.. ఇప్పటి వరకు ఒకెత్తు.. ఇప్పటి నుంచి ఒకెత్తు. నేను చాలామంది అమ్మాయిలకు ఐ లవ్ యు చెప్పాను. కానీ, నిన్ను మాత్రమే లవ్ చేస్తున్నా' అని తన ప్రేమని వ్యక్తం చేస్తాడు. 'నువ్వూ నేనూ కలిసుండటం జరగదు. అది మనద్దరికీ మంచిది కాదు' అని బదులిస్తుంది హీరోయిన్. మరి ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది? వాళ్ల ప్రేమ ఎందుకు బ్రేకప్ అయింది? మళ్లీ కలుసుకుంటారా, లేదా? త్వరలోనే తెలియనుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ట్రైలర్లో కనిపించిన అందరి నటనా ఆకట్టుకుంటుంది. రాహుల్ రామకృష్ణ, మహేశ్ ఆచంట కడుపుబ్బా నవ్వించారు. గీత ఎక్కడుంటుంది సర్ అని విశ్వక్‌ని ఓ వ్యక్తి అడగ్గా.. గీతకి సంబంధించి పెద్ద జాబితాని బయటపెట్టే సంభాషణ అలరిస్తుంది. నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. రధన్ సంగీతం అందించారు.
బొమ్మల కొలువు ట్రైలర్..
హృషికేశ్, సుబ్బు, ప్రియాంక శర్మ, మాళవిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'బొమ్మల కొలువు'. సుబ్బు దర్శకత్వం వహిస్తున్నారు. పృథ్వీ క్రియేషన్స్ పతాకంపై ఎ.వి.ఆర్. స్వామి నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. ఉత్కంఠభరిత సన్నివేశాలతో, చిన్న ప్రేమకథతో ఆసక్తిగా సాగింది ఈ ట్రైలర్. నటీనటుల హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. ఓ ప్రాంతంలో చాలామంది అమ్మాయిలు కిడ్నాప్‌కి గురవుతారు. వీళ్లు కనిపించడంలేదని ఫిర్యాదు చేసి, ఆ తర్వాత దాన్ని వెనక్కితీసుకుంటారు వాళ్ల బంధువులు. మరి కిడ్నాప్ చేసేదెవరు? పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిని భయపెట్టేదెవరు? తదితర ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ ట్రైలర్‌కి ప్రవీణ్ లక్కరాజు అందించిన నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. టైటిల్‌కి తగ్గట్టు చెక్క బొమ్మల్ని చూపిస్తూ కథని నడిపిన తీరు మెప్పిస్తుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:'కథ వింటున్నప్పుడే కంటతడి పెట్టేశా'