ETV Bharat / sitara

Oscars 2022: భార్యపై అలాంటి జోక్​.. కమెడియన్​ చెంప చెళ్లుమనిపించిన హీరో - will smith oscar

Oscars 2022: ప్రతిష్ఠాత్మక ఆస్కార్​ పురస్కారాల ప్రదానోత్సవం సందర్భంగా ఓ కమెడియన్​ చెంప పగలగొట్టాడు స్టార్​ హీరో విల్​స్మిత్. తన భార్య జడా స్మిత్​పై అతడు జోక్​ చేయడమే అందుకు కారణం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Oscars 2022
Will Smith
author img

By

Published : Mar 28, 2022, 10:11 AM IST

Oscars 2022: 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో అనూహ్య ఘటన జరిగింది. కమెడియన్ క్రిస్​ రాక్ చెంప చెళ్లుమనిపించాడు స్టార్​ హీరో విల్​స్మిత్. తన భార్య జడా పింకెట్​ స్మిత్​పై అతడు జోక్​ వేయడమే అందుకు కారణం. గుండుతో ఉన్న జడాను 'జి.ఐ జేన్'​ సినిమా సీక్వెల్​లో చూడాలనుకుంటున్నట్లు క్రిస్​ జోక్ చేశాడు. (ఆ సినిమాలో ప్రధాన పాత్రధారి గుండుతో కనిపిస్తారు).

ఈ జోక్ పట్ల తొలుత స్మిత్​ నవ్వేసి ఊరుకున్నాడు. అయితే అతడి భార్య జడా పింకెట్​ మాత్రం అందుకు బాధపడింది. దీంతో స్టేజ్ మీదకు వెళ్లి.. క్రిస్​ చెంప పగలగొట్టాడు స్మిత్​. అనంతరం కిందకి వచ్చి కూర్చుకున్న తర్వాత.. "నా భార్య గురించి మాట్లాడకు" అంటూ హెచ్చరించాడు. ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే 'కింగ్ రిచర్డ్'​ సినిమాలో ప్రదర్శనకు గానూ ఉత్తమ నటుడిగా ఆస్కార్​ గెలుచుకున్నాడు విల్​ స్మిత్​. అవార్డును స్వీకరిస్తున్న సందర్భంగా తన ప్రవర్తనకు క్షమాపణ చెప్పాడు. "ప్రేమ మనల్ని ఇలాంటి పిచ్చి పనులు చేయిస్తుంది. సినిమా రంగంలో ఎలాంటి విమర్శలనైనా నవ్వుతూ స్వీకరించాలి. అంతా బాగానే ఉన్నట్లు ప్రవర్తించాలి." అని స్మిత్ పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: Oscars 2022: 'డ్యూన్' చిత్రానికి అవార్డుల పంట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.