ETV Bharat / sitara

ఆస్కార్​ బరిలో 'షేమ్​లెస్' లఘుచిత్రం​ - ఆస్కార్​ పురస్కారాలు లఘుచిత్రం

ఈ ఏడాది భారత్​ తరఫున 'ఆస్కార్​ ' పురస్కారానికి అర్హత సాధించింది షేమ్​లెస్​ అనే లఘుచిత్రం​. మొత్తం ఐదు సినిమాలు పోటీపడగా.. చివరికి ఈ షార్ట్​ ఫిల్మ్​ నామినేట్​ అయింది. కేయిత్​ గోమ్స్​ అనే ఓ యువ దర్శకుడు దీన్ని తెరకెక్కించాడు.

Oscars 2021: Keith Gomes' 'Shameless' is India's official entry for short film
ఆస్కార్​ బరిలో భారత్​ నుంచి 'షేమ్​లెస్' లఘుచిత్రం​
author img

By

Published : Nov 28, 2020, 9:35 PM IST

ప్రతిష్ఠాత్మక ఆస్కార్​ పురస్కారాల కోసం భారత్​ నుంచి 'షేమ్​లెస్'​ అనే ఓ లఘుచిత్రం నామినేట్​ అయింది. లైవ్ యాక్షన్​ కేటగిరీలో ఇది పోటీపడుతోంది. అకాడమీ అవార్డుల​ రేసులో నిలిచినందుకు ఈ సినిమా దర్శకుడు కేయిత్​ గోమ్స్​ హర్షం వ్యక్తం చేశాడు. తన చిత్ర బృందానికి కృతజ్ఞతలు చెప్పాడు.

"ఈ ప్రత్యేక సందర్భంలో నా సినిమా నటీనటులకు, సిబ్బందికి నేను ధన్యవాదాలు చెప్పాలి. నా కుటుంబం, స్నేహితులు చేసిన ధనసాయంతో నేను సినిమాలు తీస్తుంటాను. వాళ్లంతా ప్రేమ, ఆసక్తితో నాతో కలిసి వస్తారు. అంతకంటే మరింత ఆశీర్వాదం ఇంకేం లేదు."

--కేయిత్​ గోమ్స్​, 'షేమ్​లెస్'​ లఘుచిత్ర దర్శకుడు

భారత్​నుంచి నట్​ఖట్​, సౌండ్​ ప్రూఫ్​, సఫర్​, ట్రాప్​డ్ అనే నాలుగు​ లఘు చిత్రాలతో పోటీ పడి..​ ఆస్కార్​కు అర్హత సాధించింది షేమ్​లెస్. 15 నిమిషాల నిడివి గల ఈ కామెడీ థ్రిల్లర్​ సినిమాలో.. సాయని గుప్తా, హుస్సేన్​ దలాల్​, రిషభ్​ కపూర్​ తదితరులు నటించారు.

ఇటీవల ముగిసిన 3వ 'బెస్ట్​ ఆఫ్​ ఇండియా షార్ట్​ ఫిల్మ్​ ఫెస్టివల్​ 2020'లో 'షేమ్​లెస్'​ లఘుచిత్రం విజేతగా నిలిచింది.

ఇదీ చూడండి:ఆస్కార్‌కు వెళ్లిన సినిమాలు ఏవో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.