ETV Bharat / sitara

ఏప్రిల్​లో ఆస్కార్ అవార్డుల వేడుక - ఆస్కార్ అవార్డుల వేడుక వాయిదా

కరోనా కారణంగా 93వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా పడింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న జరగాల్సిన ఈ వేడుకను ఏప్రిల్​ 25కు వాయిదా వేసింది ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్​ అండ్ సైన్సెస్.

Oscar
ఆస్కార్స్
author img

By

Published : Jun 16, 2020, 10:10 AM IST

సినిమా రంగంపై కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా పడింది. 2021 ఫిబ్రవరి 28న జరగాల్సిన 93వ అకాడమీ అవార్డుల వేడుకను 2021 ఏప్రిల్ 25న నిర్వహిస్తామని ది అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్ వెల్లడించింది.

కరోనా మహమ్మారి ప్రభావం సినిమా పరిశ్రమపై తీవ్రంగా పడిందని ఈ వాయిదా సమయం సినిమాలను పూర్తి చేయడానికి ఉపయోగపడుతుందని అకాడమీ ప్రెసిడెంట్ డేవిడ్ రుబిన్ వెల్లడించారు. పూర్తి రక్షణ చర్యలతో వచ్చే ఏడాది ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవాన్ని కోలాహలంగా నిర్వహిస్తామని తెలిపారు.

ఈ వేడుకను వర్చువల్‌గా నిర్వహించాలన్న అంశమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రుబిన్ వెల్లడించారు. ఆస్కార్‌కు అవార్డుల కోసం సినిమాలను పంపే గడువును కూడా 2020 డిసెంబర్ 31 నుంచి 2021 ఫిబ్రవరి 28 వరకూ పొడిగించారు. 1981 తర్వాత ఈ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా పడడం ఇదే తొలిసారి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.