ETV Bharat / sitara

బాలకృష్ణతో బరిలో దిగే మరో విలన్​ ఎవరు?​ - two villans in balakrishna new movie

బోయపాటి శ్రీను తెరకెక్కించనున్న కొత్త చిత్రంలో ఇద్దరు ప్రతినాయకులతో బాలయ్య ఫైట్​ చేయనున్నారు. ఇప్పటికే ఓ పాత్రకు శ్రీకాంత్​ను ఎంపిక చేయగా.. మరొకరి కోసం చిత్రబృందం పరిశీలిస్తుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

One more person doing negative role in Balakrishna-Boyapati Srinu new movie
బాలకృష్ణతో బరిలో దిగే మరో విలన్​ ఎవరు?​
author img

By

Published : May 14, 2020, 7:05 AM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను.. ఇదో శక్తిమంతమైన కలయిక. విజయవంతమైన 'సింహా', 'లెజెండ్‌' చిత్రాల తర్వాత ఈ కలయికలో మూడో చిత్రం రూపొందుతోంది. ద్వారక క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో దర్శనమిస్తారు. కొన్ని సన్నివేశాల్లో అఘోరాగా కనిపించబోతున్నారు.

బాలకృష్ణ శైలికి తగ్గట్టుగా ఓ శక్తిమంతమైన కథని సిద్ధం చేశారు దర్శకుడు బోయపాటి. ఈ సినిమాలో రెండు ప్రతినాయక పాత్రలు ఉంటాయని చిత్రబృందం తెలిపింది. ఒక పాత్ర కోసం ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ని ఎంపిక చేశారు. మరో ప్రధాన ప్రతినాయక పాత్ర కోసం నటుడిని ఎంపిక చేయడంపై దృష్టిసారించింది చిత్రబృందం. వారణాసిలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నారని సమాచారం. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత చిత్రీకరణ ప్రారంభిస్తారు.

ఇదీ చూడండి.. రేపే నిఖిల్-పల్లవిల వివాహం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.