కన్నడ పవర్‌స్టార్ పునీత్‌రాజ్ కుమార్ మరణం.. సినీ పరిశ్రమతో పాటు అభిమానులకు తీవ్రశోకాన్ని మిగిల్చింది. అయితే పునీత్ ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోయి.. కొంతమంది అభిమానులు మరణించారు(puneeth rajkumar fans died) . ఇప్పటివరకు పది మంది మృతిచెందగా.. మరో వ్యక్తి తాజాగా ఆత్మహత్య చేసుకున్నాడు. హాసన్ జిల్లాకు చెందిన మయూర్ నాగరాజ్(34) అనే అభిమాని.. తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

మయూర్ నాగరాజ్.. హాసన్ జిల్లాకు చెందిన రాజ్‌కుమార్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హెచ్.ఆర్.నాగరాజు కుమారుడు. హెచ్.ఆర్. నాగరాజ్ ఇప్పటికే మృతి చెందారు. అయితే.. రాజ్‌కుమార్ మృతి చెందినప్పటి నుంచి మనోవేదనకు గురవుతున్న మయూర్.. ఎప్పుడూ తమ అభిమాన హీరో గురించే మాట్లాడేవాడు. తాజాగా ఇంట్లో బుధవారం ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళితే.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
హీరో రాజ్‌కుమార్ మృతి అనంతరం 8 మంది ఆత్మహత్య చేసుకోగా.. ముగ్గురు గుండెపోటుతో చనిపోయారు.
ఇదీ చదవండి:అన్నా హజారేకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక