లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రముఖ నటుడు సోనూసూద్.. ప్రతిఒక్కరి మనసులో చెరిగిపోని స్థానం సంపాదించారు. ఈరోజు 48వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మరోసారి మంచి మనసు చాటుకున్నారు. నిరుద్యోగులైన వలసకూలీలకు 3 లక్షల పైచిలుకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. వీటిని ప్రవాసీ రోజ్గర్ పోర్టల్ ద్వారా భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.
"నా పుట్టినరోజున నావైపు నుంచి చిన్న సాయం చేసేందుకు సిద్ధమయ్యాను. ప్రవాసీరోజ్గర్.కామ్ ద్వారా మూడు లక్షల ఉద్యోగాలు వలసకూలీలకు ఇవ్వనున్నాం. వీరందరికీ మంచి జీతాలతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ ఇతర సదుపాయాలు వర్తించనున్నాయి. ఏఈపీసీ, సీఐటీఐ, ట్రైడెంట్, క్వెస్కార్ప్, అమెజాన్, సోడెక్స్, అర్బన్ కో, పోరెటా సంస్థలు ఈ అవకాశాల్ని ఇస్తున్నాయి. వీరందరికీ నా తరఫున ధన్యవాదాలు" అని సోనూసూద్ రాసుకొచ్చారు.
-
मेरे जन्मदिन के अवसर पे मेरे प्रवासी भाइयों के लिए https://t.co/UWWbpO77Cf का 3 लाख नौकरियों के लिए मेरा करार। ये सभी अच्छे वेतन, PF,ESI और अन्य लाभ प्रदान करते हैं। धन्यवाद् AEPC, CITI, Trident, Quess Corp, Amazon, Sodexo, Urban Co , Portea और अन्य सभी का।#AbIndiaBanegaKamyaab pic.twitter.com/rjQ0rXnJAl
— sonu sood (@SonuSood) July 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">मेरे जन्मदिन के अवसर पे मेरे प्रवासी भाइयों के लिए https://t.co/UWWbpO77Cf का 3 लाख नौकरियों के लिए मेरा करार। ये सभी अच्छे वेतन, PF,ESI और अन्य लाभ प्रदान करते हैं। धन्यवाद् AEPC, CITI, Trident, Quess Corp, Amazon, Sodexo, Urban Co , Portea और अन्य सभी का।#AbIndiaBanegaKamyaab pic.twitter.com/rjQ0rXnJAl
— sonu sood (@SonuSood) July 30, 2020मेरे जन्मदिन के अवसर पे मेरे प्रवासी भाइयों के लिए https://t.co/UWWbpO77Cf का 3 लाख नौकरियों के लिए मेरा करार। ये सभी अच्छे वेतन, PF,ESI और अन्य लाभ प्रदान करते हैं। धन्यवाद् AEPC, CITI, Trident, Quess Corp, Amazon, Sodexo, Urban Co , Portea और अन्य सभी का।#AbIndiaBanegaKamyaab pic.twitter.com/rjQ0rXnJAl
— sonu sood (@SonuSood) July 30, 2020
పుట్టినరోజున సోనూ, దేశ వ్యాప్తంగా పలు చోట్ల వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. యూపీ, జార్ఖండ్, పంజాబ్, ఒడిశాలోని వైద్యులను సంప్రదించి ప్రజలకు అవసరమైన చోట ఉచిత వైద్యశిబిరాలు, క్యాంపులు నిర్వహిస్తున్నట్టు ఈ నటుడు పేర్కొన్నారు. వీటికి దాదాపు 50వేల మంది వరకు వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు.
ఇప్పటికే లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వలసకూలీలను వారి స్వస్థలాలకు చేర్చుతూ గుర్తింపు తెచ్చుకున్నారు సోనూ. మహిళలు, పిల్లలు, విదేశాల్లో చిక్కుకున్న విద్యార్థులు, కష్టాల్లో ఉన్న రైతులు.. ఇలా అందరికీ తన వంతు సాయం చేస్తూ పేరు సంపాదించారు.
ఇది చదవండి: సినిమాల్లో నటుడు.. ప్రజలకు ఆపద్బాంధవుడు