ETV Bharat / sitara

'నాట్యం' సినిమాకు ఎన్టీఆర్​ వాయిస్​ ఓవర్!​ - ఎన్టీఆర్​ నాట్యం టీజర్​

టాలీవుడ్​లో కూచిపూడి నేపథ్యంతో తెరకెక్కుతోన్న కొత్త చిత్రం 'నాట్యం'. ఈ చిత్ర టీజర్​ను బుధవారం (ఫిబ్రవరి 10) ఎన్టీఆర్​ చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు ఎన్టీఆర్​ వాయిస్​ ఓవర్​ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

NTR voice over to natyam movie
'నాట్యం' సినిమాకు ఎన్టీఆర్​ వాయిస్​ ఓవర్!​
author img

By

Published : Feb 9, 2021, 4:44 PM IST

ప్ర‌ముఖ కూచిపూడి నృత్య‌కారిణి సంధ్య‌రాజు ప్రధానపాత్ర న‌టిస్తోన్న చిత్రం 'నాట్యం'. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్​లుక్​ విడుదలైంది. ఈ సినిమా టీజర్​ను బుధవారం (ఫిబ్రవరి 10) ఉదయం 10.08 గంటలకు యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

అంతేకాదు.. ఈ సినిమాకు ఎన్టీఆర్​ వాయిస్​ ఓవర్​ ఇవ్వనున్నారని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. 'నాట్యం' చిత్రాన్ని నిశృంకల ఫిల్మ్స్​ బ్యానర్​పై నిర్మిస్తుండగా.. రేవంత్​ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కమల్​ కామరాజు, రోహిత్​ బెహల్​, భానుప్రియ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి: పవన్​ ఫ్యాన్స్​కు నిరాశ.. రెండో సాంగ్​ లేదట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.