'అరవింద సమేత' తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కనున్న చిత్రాన్ని ఏప్రిల్‌లో మొదలుపెట్టనున్నట్లు సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ వెల్లడించారు. మిగతా నటీనటులెవరూ ఇంకా ఖరారు కాలేదని పేర్కొన్న ఆయన.. తమ నిర్మాణ సంస్థలో విడుదలైన 'జెర్సీ' చిత్రానికి రెండు జాతీయ పురస్కారాలు రావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
కథానాయకుడు నాని, దర్శకుడు గౌతమ్‌కు జాతీయ పురస్కారాలు వస్తాయని అంచనా వేశామని, తమ అంచనాలను తలకిందులు చేస్తూ రెండు అవార్డులు రావడం మరింత ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. అలాగే రానా-పవన్ కల్యాణ్ కలయికలో వస్తున్న 'అయ్యపనుమ్ కోషియమ్' రీమేక్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలిపారు. మాతృకకు ఏమాత్రం తీసిపోని విధంగా తెలుగు ప్రేక్షకుల ఆదరించేలా ఆ సినిమా నిర్మాణం జరుపుకుంటుందని వివరించారు.
రానాకు జోడీగా ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్నట్లు వెల్లడించిన నాగవంశీ.. పవన్ కల్యాణ్ కోసం కథానాయికను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. రానా-పవన్ కల్యాణ్ పాత్రల స్వభావానికి సరితూగేలా ఉండాలనే ఉద్దేశంతోనే దర్శకుడు త్రివిక్రమ్ మాటలు రాస్తున్నారని స్పష్టం చేశారు. తమ నిర్మాణ సంస్థలో ఏ సినిమా ఎంపిక చేసినా ఒక ప్రేక్షకుడిగా తుదిమెరుగులు దిద్దేది త్రివిక్రమ్ మాత్రమేనని చెప్పారు. నితిన్-కీర్తిసురేష్ జంటగా 'రంగ్ దే' చిత్రం ఈనెల 26న విడుదల అవుతుందని, వచ్చే వారం 'జెర్సీ', 'రంగ్ దే' వేడుకలను ఘనంగా జరుపుకోనున్నట్లు నాగవంశీ తెలిపారు.
ఇదీ చూడండి: తారక్-త్రివిక్రమ్ మూవీ టైటిల్ 'చౌడప్పనాయుడు'?
ఇదీ చూడండి: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో రష్మిక?
ఇదీ చూడండి: జూ.ఎన్టీఆర్‌కు విలన్‌గా విజయ్ సేతుపతి!